సొంతంగా విమానాన్నే సీఎం రమేశ్ కొనేశారా? ఎంపీ ఆఫీస్ క్లారిటీ

Update: 2021-06-27 18:11 GMT
టీడీపీలో రాజ్యసభ ఎంపీగా మొదలైన ఆయన రాజకీయ జీవితం ఇప్పుడు బీజేపీలో చేరాదాక సాగింది. చంద్రబాబుకు ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచిన వ్యాపారవేత్త సీఎం రమేశ్ సొంతంగా విమానాన్ని కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సీఎం రమేశ్ తోసిపుచ్చారు.

తాజాగా ఎంపీ కార్యాలయం దీనిపై వివరణ ఇచ్చింది.  ఎయిర్ క్రాఫ్ట్ కు రమేశ్ పూజలు మాత్రమే చేశారని.. ఆయనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని యర్రగుంట్ల మండలం పొట్లదుర్తికి చెందిన సీఎం రమేశ్ స్వతహాగా పారిశ్రామికవేత్త. రిత్విక్ అండ్ రిత్విక్ ప్రాజెక్ట్ వ్యవస్థాపక చైర్మన్. రోడ్ల నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి, నీటి ప్రాజెక్టులు, మౌళిక వసతుల రంగంలో ఉన్నారు. టాప్ కంపెనీగా గుర్తింపు పొందారు.

వ్యాపార అవసరాల రీత్యా విమాన ప్రయాణాలు తరచూ చేయాల్సి ఉంటుంది. కరోనా పరిస్థితుల్లో ఇప్పుడు అందరితో కలిసి తిరగడం ఆరోగ్యానికే ముప్పు. అందుకే ఆయన రాకపోకలకు సొంతంగా విమానాన్నే కొనేశారని టాక్ వచ్చింది. ఎనిమిది సీట్ల సామర్థ్యం గల చార్టెడ్ ఫ్లైట్ కు సీఎం రమేశ్ పూజలు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీఎం రమేశ్ ఏకంగా సొంత ఫ్లైట్ కొన్నాడన్నది హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ వీడియోలు, ఫొటోలు నిరాధారమైనవని సీఎం రమేశ్ కార్యాలయం తెలిపింది. ఈ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ ను కొన్న ఓనర్ ఆహ్వానం మేరకు సీఎం రమేశ్ హాజరయ్యారని.. ఆ పూజల్లో పాల్గొని మాత్రమే అలా కొబ్బరికాయలు కొట్టారని తెలిపారు. ఆ విమానం సీఎం రమేశ్ ది కాదని వివరణ ఇచ్చారు. చార్టెడ్ ఫ్లైట్ కు కానీ.. సీఎం రమేశ్ కు గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
Tags:    

Similar News