తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కు సంబంధించిన విచారణను హైదరాబాద్ పోలీసులు వేగంగా నిర్వహిస్తున్నారు. నిందితుల్నిపట్టుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కిడ్నాప్ వ్యవహరంలో స్కెచ్ వేసిన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఇదిలా ఉంటే.. అఖిలప్రియ భర్తను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. కానీ అధికారికంగా వివరాలు వెల్లడించటం లేదన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. కిడ్నాప్ ఉదంతంలో ఇప్పటికే పలువురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. ఈ కేసులో కీలకమైన గుంటూరు శ్రీనును అదుపులోకి తీసుకునేందుక విపరీతంగా ప్రయత్నిస్తున్నా.. అతడి ఆచూకీ మాత్రం లభించటం లేదని తెలుస్తోంది. గుంటూరు శ్రీనుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన పోలీసులు.. ఫూణెలో ఉన్నట్లుగా గుర్తించారు. ఆ వెంటనే ఒక టీం అతడ్ని పట్టుకునేందుకు అక్కడికి వెళ్లినట్లుగా చెబుతున్నారు.
తీరా పోలీసులు ఫూణెకు వెళ్లి.. అతడు బస చేసిన హోటల్ కు చేరుకునే సమయానికి గుంటూరు శ్రీను అక్కడి నుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే.. కొందరు మాత్రం ఇదేమీ నిజం కాదంటున్నారు. గుంటూరు శ్రీను కూడా పోలీసుల అదుపులో ఉన్నాడని.. అతడ్ని గుట్టుగా విచారిస్తున్నారని.. మొత్తం వివరాలు సేకరించేందుకు వీలుగా ఇంకా పట్టుబడలేదని పోలీసులు చెబుతున్నట్లుగా వాదన వినిపిస్తోంది. ఏమైనా.. ఈ కేసులో అతి కీలకమైన వారిలో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్.. వారి కుటుంబానికి సన్నిహితుడైన గుంటూరు శ్రీనులు పట్టుబడితే ఈ కేసు చిక్కుముడులు దాదాపుగా వీడిపోతాయని చెబుతున్నారు.