బీజేపీపైనా.. ఆ పార్టీ అధినాయతక్వంపైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ తరచూ చేసే ఆరోపణలు చాలానే అనుమానాల్ని రేకెత్తిస్తుంటాయి. వారి మాటలు విన్నప్పుడు నిజమే కదా? అన్న భావన కలుగక మానదు. ఇలాంటివేళ.. పలు సందేహాలకు సమాధానాలు ఇస్తూ.. అనుమానాలు తీరేలా చేశారు కిషన్ రెడ్డి. ఇంతకీ ఆయన చెప్పిన అంశాల్ని చూస్తే..
- హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా ఉందన్నారు?
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని చాలావరకు తగ్గించాం.. టెక్నాలజీ వాడుతున్నాం. విదేశాల నుంచి వచ్చే నిధులు ఉగ్రవాదులకు చేరకుండా అడ్డుకోగలిగాం. ఫలితంగా హైదరాబాద్ తో సహా పలు నగరాల్లో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది.
- తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదు..?
తెలంగాణ ఆదాయంలో 80 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. హైదరాబాద్.. రంగారెడ్డి ఆదాయాన్ని అదిలాబాద్.. మరోజిల్లాలోనే ఖర్చు ఎందుకు ఖర్చు చేస్తున్నారని హైదరాబాదీలు అడిగితే ఏం చెబుతారు? వారి చేతికి ఇస్తేనే.. కల్వకుంట్ల ఖాతాలో వేస్తేనే నిధులు ఇచ్చినట్లా? దేశ సరిహద్దుల్లో.. శాంతిభద్రతల పరిరక్షణకు.. మతకలహాల కట్టడిలో దేశ వ్యాప్తంగా పని చేసే 11 లక్షల మంది సీఆర్ఫీఎఫ్ పోలీసులకు జీతాలు ఎవరు ఇస్తారు?
- రాష్ట్రం ఇచ్చే పన్ను వాటాలో కేంద్రం ఇచ్చేది చాలా చాలా తక్కువ
ఇలాంటి చర్చ దేశ సమైక్యతకు మంచిది కాదు. కేంద్రానికి వచ్చేది ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బు. రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము కాదు. ఆ ఆదాయంతో దేశ రక్షణ.. రైల్వేలు.. అంతర్గత భద్రతకు ఖర్చు చేస్తుంది. కేంద్రం ఏటా రూ.30 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది.
తెలంగాణలో మధ్యాహ్న భోజనం పథకం.. వంటగ్యాస్, ఎరువులకు సబ్సిడీ.. గ్రామీణ, పట్టణ, జాతీయ రహదారులకు రూ.లక్షల కోట్లు ఇస్తోంది. తెలంగాణలో పేదలకు ఇచ్చే ప్రతి కేజీ బియ్యంలో మోడీ ప్రభుత్వం రూ.30 ఇస్తోంది. హైదరాబాద్ లో రక్షణ.. పరిశోధన సంస్థల గురించి గొప్పలు చెప్పే కేసీఆర్..కేటీఆర్.. వాటికి అయ్యే ఖర్చులు.. జీతాలు కేంద్రమే భరిస్తోంది కదా?
- కర్ణాటక.. గుజరాత్ లకు వరద సాయం ఇచ్చిన మోడీ.. హైదరాబాద్ కు పైసా ఇవ్వకపోవటం ఏమిటి?
తెలంగాణలో పంటనష్టంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదిక ఇవ్వలేదు. కర్ణాటకలో వరదలకు బాగా దెబ్బ తిన్న బెంగళూరు మహానగరంలో అక్కడి సీఎం స్వయంగా వెళ్లి నష్టపరిహారం ఇచ్చారు. ఇక్కడ సీఎం కేసీఆర్ వరద బాధితుల్ని పరామర్శించారా?
- రాజకీయాల కోసం బీజేపీ మతాన్ని వాడుకుంటుందన్న విమర్శలపై?
పదిహేను నిమిషాల సమయమిస్తే.. 100 కోట్ల మంది హిందువుల సంగతి చూస్తానన్న మజ్లిస్ తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. బీజేపీని విమర్శించే నైతిక హక్కు ఆ పార్టీకి ఎక్కడిది? బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎక్కడైనా మత కలహాలు జరిగాయా? కర్ఫ్యూలు పెట్టారా? బీజేపీకి తండ్రి..కొడుకుల సర్టిఫికేట్ అక్కర్లేదు.
- ఇక్కడ మజ్లిస్ తో ఢీ అంటారు. బిహార్ లో మజ్లిస్ పోటీకి అమిత్ షానే అని కేజ్రీవాల్ అంటున్నారు?
బిహార్ లో పోటీ చేయాలని ఓవైసీని అమిత్ షా ఎప్పుడూ అడగలేదు. ఇతర రాష్ట్రాల్లో వారు పోటీ చేయటం వల్ల మాకొచ్చే లాభం లేదు. రాజకీయాల్లో భాగంగానే కేజ్రీవాల్ లాంటోళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.