ఆంధప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ప్రతిపక్షాలు, ఆర్థిక నిపుణులు, వివిధ సంఘాల మేధావులు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం లెక్కకు మిక్కిలి అప్పులు చేసిందని.. ఏపీ మరో శ్రీలంకలా మారడం ఖాయమని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఆర్థిక పరిస్థితిని నిభాయించలేక ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కూడా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అప్పు 2022 మార్చి నాటికి రూ.3,98,903.60 కోట్లు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌధరి లోక్ సభలో టీ డీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పనిలో పనిగా జీడీపీలో ఆంధ్రప్రదేశ్ అప్పుల వాటాను కూడా కేంద్ర మంత్రి వివరించారు.
ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అప్పు, ఇతరత్రా చెల్లింపుల భారం కలిపి రూ.8.71 లక్షల కోట్లకు చేరిందని నిపుణులు లెక్కలు వేస్తున్న సంగతి తెలిసిందే. తిమ్మిని బమ్మి చేసి.. ప్రభుత్వ కార్పొరేషన్లను సైతం తనఖా పెట్టి జగన్ ప్రభుత్వం అప్పలు తెస్తోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం లోక్‌సభలో దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పుల గణాంకాలను లిఖితపూర్వకంగా తెలియజేసింది. ఆయా గణాంకాలకు ఆధారం ఎక్కడిదో కూడా వెల్లడించింది.
'స్టేట్ ఫైనాన్సెస్: ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ ఆఫ్ 2021–22' పుస్తకం ఆధారంగా తాము ఈ లెక్కలు చెబుతున్నామని కేంద్ర మంత్రి చౌధరి స్వయంగా తెలిపారు. అయితే రిజర్వు బ్యాంకు 2021 నవంబరులోనే ఈ పుస్తకాన్ని విడుదల చేసింది.
అయితే ఈ పుస్తకంలో విశేషమేమీ లేదని అంటున్నారు. ఎందుకంటే ఈ పుస్తకాన్ని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన లెక్కల ఆధారంగానే రూపొందించారని కేంద్రమే పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారికంగా జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.3,98,000 కోట్ల అని వెల్లడవుతోంది. ఇక కార్పొరేషన్ల పేరుతో, ఇతర మార్గాల్లో తెచ్చిన అప్పులు ఈ మొత్తానికి అదనమని చెబుతున్నారు.
అయితే తాజాగా లోక్ సభలో కేంద్రం తెలిపిన ఆంధ్రప్రదేశ్ అప్పుల లెక్కల్లో రాష్ట్రాలు రహస్యంగా చేస్తున్న, పరిమితికి మించి వివిధ రూపాల్లో తీసుకుంటున్న అప్పుల వివరాలు ఆయా గణాంకాల్లో లేవని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికే వస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడిస్తున్న అప్పుల అంకెలనే కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో తాజాగా వివరించింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ అసలు అప్పులు ఇందులో బయటపడే అవకాశం లేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.