లక్ష డెడ్‌ బాడీ బ్యాగులు రెడీ చేస్తున్న అమెరికా

Update: 2020-04-05 01:30 GMT
అమెరికా శవాల గుట్టగా మారబోతుందా.. రెండు లక్షల మంది అమెరికన్లు కరోనాకు బలి కానున్నారా..? అంటే అవుననే అంటోంది అమెరికన్ మీడియా. అమెరికా ప్రభుత్వం లక్ష బాడీ బ్యాగ్స్ సిద్ధం చేస్తుండడమే దానికి ఉదాహరణగా చెబుతున్నాయి.
అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచంలో ఇంకే దేశంలో లేనంతగా పెరిగిపోయాయి. మరణాలు కూడా 7 వేలు దాటిపోయాయి. రోజురోజుకూ కొత్తగా కొన్ని వేళ మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. ఈ పరిస్థితుల్లో వైట్ హౌస్ వర్గాలు కనీసం లక్ష మంది చనిపోతారని అంచనా వేస్తున్నాయి. మృతుల సంఖ్య 2 లక్షలు దాటినా దాటొచ్చని ఆందోళన చెందుతున్నారు.

ఈ పరిస్థితుల్లో అమెరికా తన దేశ ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ఫెమా)ను లక్ష బాడీ బ్యాగ్స్ సిద్ధం చేయమని ఆదేశించింది. పెంటగాన్ కూడా ఈ విషయం నిజమేనని ప్రకటించింది.దీంతో అమెరికా ఫుల్ క్లారిటీ తో ఉందని.. లక్షల మంది చనిపోతారని ఫిక్సయిపోయిందని చెబుతున్నారు. అయితే.. ప్రపంచదేశాల
విశ్లేషకులు మాత్రం అమెరికా తగిన సమయం లో తగిన నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. ఇప్పటికీ ట్రంప్ మొండిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
Tags:    

Similar News