జడ్జితో జంటపేలుళ్ల దోషుల వెటకారం!!

Update: 2016-12-20 09:30 GMT

తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్లు ప్రజల ప్రాణాలతో సునాయాశంగ ఆడుకునే నరరూప రాక్షసులకు గౌరవప్రదమైన జడ్జిని గౌరవించాలని ఏముంటుంది. న్యాయ్మూర్తిని ఏమి అడగాలి.. ఏమి అడగకూడదు అనే ఇంగితం వారికి ఉంటుందని ఆశించడం కూడా పొరపాటే. ఇంతకూ విషయం ఏమిటంటే... దిల్‌ సుఖ్‌ నగర్ జంట పేలుళ్ల కేసులో దోషులైన ఉగ్రవాదులు, కోర్టులో దుస్సాహసానికి పాల్పడ్డారు. తమకు విధించిన జరిమానాను రద్దయిన నోట్లతో చెల్లించాలా? లేక కొత్త రెండువేల నోట్లతో చెల్లించాలా? అంటూ న్యాయమూర్తిని అడిగారు! ఈ విషయంలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యాసిన్ భత్కల్ తోపాటు ఇతర ఉగ్రవాదులు ఇదే విషయం న్యాయమూర్తిని అడిగారు!!

దిల్‌ సుఖ్‌ నగర్ జంట పేలుళ్లకు పాల్పడిన కేసులో యాసిన్, అసదుల్లా అక్తర్, జియా ఉర్ రెహమాన్ అలియాస్ వకాస్, అజజ్ షేక్, తహసీన్ అక్తర్‌ లకు సోమవారం ఎన్.ఐ.ఏ. కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు "మీరేమైనా చెప్పదల్చుకున్నారా?" అని ప్రశ్నించిన కోర్టుకు... "మమ్మల్ని ఉరి తీయండి" అంటూ ఉగ్ర నిందితులు బదులిచ్చారు. దీంతో అప్పటికే అన్ని వాదనలూ పూర్తవడంతో న్యాయమూర్తి.. పేలుళ్ల దోషులు ఐదుగురికి కూడా ఉరిశిక్షతోపాటు రూ. 4000ల జరిమానా విధించారు. ఈ జరిమానా విధించిన సందర్భంగా న్యాయమూర్తిని ప్రశ్నించిన యాసిన్ భక్తల్ - ఇతర దోషులు... "జరిమానా విధించిన డబ్బును రద్దయిన నోట్లతో చెల్లించాలా? లేక కొత్త నోట్లతోనా?" అని న్యాయమూర్తిని ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News