ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం మొదలైంది. తొలి విడత ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. విజయనగరంజిల్లా తప్ప, మిగతా 12 జిల్లాలో తొలి విడత నామినేషన్లను అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 31 వరకూ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి దశలో మొత్తం 3,249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9వ తేదీన తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.
వివిధ పార్టీల అభ్యర్థన మేరకు గ్రామ వాలంటీర్లు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం స్ట్రిక్ట్‌గా ఆదేశాలు జారీ చేసింది. అయితే , ఈ రోజు మొదటి విడత నామినేషన్ల ప్రక్రియలో కాకినాడలోని కొన్ని చోట్ల గ్రామ వాలంటీర్లు కనిపించారని ప్రముఖ ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. నామినేషన్ల ప్రక్రియలో గ్రామ వాలంటీర్లు పాల్గొనకూడదు అని ఎస్ ఈసీ నిబంధనలు ఉన్నప్పటికీ , పలు గ్రామ పంచాయతీ పరిసరాల్లో వాలంటీర్లు ప్రత్యక్ష మయ్యారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం స్థానిక ఎన్నికల అధికారుల దృష్టికి వెళ్లినా , వారు పట్టించుకోలేదని అంటున్నారు. మరో వైపు అధికార పార్టీ ఏకక్రీవాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవాలు జరిగితే గ్రామాలకే మంచిదని, అభివృద్ధి నిధులు అధికంగా వస్తాయని చెబుతున్నారు. వీలైనన్ని ఎక్కువ పంచాయతీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తుంది.