దేశంలో నకిలీ భాగోతాలు బయట పడుతున్నాయి. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కుతున్నారు. దీనికి ఎవరు అతీతులు కారు. ఎంత పెద్ద హోదాలో ఉన్న వారైనా స్కాముల్లో ఇరుక్కోవడం ఇటీవల కామన్ గా మారిపోయింది. ఫలితంగా నేరాలు పెరుగుతున్నాయి. ఆ మధ్య టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ వ్యవహారం మరిచిపోకముందే మళ్లీ ఓ నకిలీ కథ ముందరకు వచ్చింది. నకిలీ సర్టిఫికెట్లు అంటగడుతూ అడ్డంగా దొరికిపోయారు.
దీనికి కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించిన వారు ఓ సినీ దర్శకుడు కావడం గమనార్హం. దీంతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విద్యార్థుల నుంచి లక్షలు వసూలు చేసి వారికి అంటగడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దర్శకుడు ఇలా నకిలీ ఏజెండు అవతారమెత్తడం చర్చనీయాంశం అయింది. దీంతో వారి బాగోతం వెలుగులోకి రావడంతో ఇప్పుడు వైరల్ గా మారింది.
అచ్చం అర్జున్ సురవరం సినిమాలో కథ మాదిరే వీళ్లు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడం వల్ల పోలీసులకు తెలిసింది. డైరెక్టరే ప్రధాన నిందితుడు అని తేలింది. దీనిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వ్యక్తి, మరో ముగ్గురు ముఠాగా ఏర్పడి ఈ తతంగం నడిపించారు.
39 నకిలీ ధ్రువపత్రాలు, 486 హోలోగ్రామ్ లు, కారు, 8 ఫోన్లు, రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 70-80 మందికి నకిలీ ధ్రువపత్రాలు విక్రయించినట్లు చెబుతున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలు స్కాంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై కూపీ లాగుతున్నారు. ఇలా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి