కరోనా ఆపలేదు.. పీపీఈ కిట్లో వచ్చి ఓటేసిన కరుణానిధి కుమార్తె

Update: 2021-04-07 04:00 GMT
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, డీఎంకె నేత కనిమొళి ఇటీవలె కరోనా బారిన పడ్డారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. కాగా తమిళనాట ఎన్నికల నేపథ్యంలో ఆమె ఓటు హక్కు వినియోగించుకోవడం ఆసక్తికరంగా మారింది.

వైరస్ బారిన పడిన ఆమె పీపీపీ కిట్ ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అంబులెన్స్లో పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనా బాధితులకు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రత్యేక వెసలుబాట్లు కల్పించింది. కాగా సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య వైరస్ బాధితులు ఓటెయొచ్చు అని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ చర్యలు తీసుకున్నారు.

ఈ మేరకు మంగళవారం సాయంత్రం ప్రత్యేక అంబులెన్స్లో చెన్నైలోని మైలాపోర్ పోలింగ్ కేంద్రానికి వచ్చి కనిమొళి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం కరోనా నన్ను ఓటు ఆపలేదు అన్నట్లుగా  మీడియాకు తన సంకేతాన్ని చూపించారు. తర్వాత మళ్లీ అంబులెన్స్లోనే వెళ్లిపోయారు. కనిమొళి తో పాటు ఆమె సహాయకులు, పోలింగ్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు అందరూ పీపీఈ కిట్లు ధరించారు.

 తూత్తుకుడి నియోజకవర్గం నుంచి కనిమొళి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమిళనాట ఎన్నికల వేళ ఆమె చురుగ్గా పాల్గొన్నారు. 234 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. 188 స్థానాల్లో డీఎంకే ఇతర స్థానాల్లో దాని మిత్ర పక్షం పోటి చేసింది. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే ల నడుమ పోటీ రసవత్తరంగా మారింది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. 
Tags:    

Similar News