కమల్ హాసన్ వీడియో.. సంచలనం

Update: 2020-11-20 16:50 GMT
తమిళనాట ఎన్నికల వేడి రాజుకుంది. మరో ఆరు నెలల్లో అక్కడ ఎన్నికల నగారా మోగనుంది. దీంతో అధికార అన్నాడీఎంకే, డీఎంకేలతోపాటు సీనియర్ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ కూడా యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు.

కమల్ హాసన్ తాజాగా ట్వీట్ చేస్తూ ‘ఓటరు ఐడీ మన చేతిలోని బ్రహ్మాస్త్రం.. అర్హులైన వారంతా ఓటరు ఐడీల కోసం సైన్ అప్ చేసుకోవాలని కోరారు.’ రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కమల్ ప్రజలను ఉద్దేశించి సీరియస్ గా ప్రసంగించారు.

‘మార్పు రావాలని ఉపన్యాసాలు దంచేవారు.. సిస్టం సరిగా పనిచేయడం లేదని విమర్శించేవారు. ప్రజాప్రతినిధులంతా దొంగలు అని తిట్టే వారికి ఓటరు ఐడీ ఉండదు. ఓటరుగా ఉండడం గౌరవం.. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోండి. అదే ఆయుధం. బాధ్యతలను సరిగా నిర్వర్తించని సమాజం. హక్కులను కోల్పోతుంది. అందుకే ఓటు వజ్రాయుధంగా వాడండి’ అని కమల్ హాసన్ వీడియోలో ప్రజలకు పిలుపునిచ్చారు.

‘2021 ఎన్నికల్లో ఓటును ఆయుధంగా వాడుకోండని.. నేను మారతాను.. నేను ఓటేస్తాను అని ప్రతిజ్ఞ చేయండి’ అని కమల్ హాసన్ కోరారు. వచ్చే ఏడాది మేలో తమిళనాడు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈసారి గెలుపే లక్ష్యంగా కమల్ హాసన్ ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి కమల్ హాసన్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.


Full View
Tags:    

Similar News