దుబాయ్‌లోని ఒక వ్యక్తి ప్రత్యేకమైన కారు నంబర్ ప్లేట్ కోసం ఏకంగా కోట్లు ఖర్చు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంతలా అంటే ప్రపంచంలోనే ఇదే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ కావడం గమనార్హం. తాజాగా నిర్వహించిన వేలంలో 35 మిలియన్ దిర్హామ్ లను అంటే మన కరెన్సీలో రూ. 70 కోట్లు లేదా $9.5 మిలియన్ డాలర్లు వెచ్చించాడు. ఇది ప్రపంచంలోనే మూడవ అత్యంత ఖరీదైనది. ఇటీవల జరిగిన 'మోస్ట్ నోబుల్ నంబర్స్' ఛారిటీ వేలం ప్రత్యేకమైన వాహన నంబర్ ప్లేట్లు మరియు మొబైల్ ఫోన్ నంబర్‌లపై బిడ్‌లు వేశారు..
ప్రముఖ వ్యక్తుల నుండి తీవ్రమైన పోటీల మధ్య జరిగిన ఈ వేలం పాటల్లో దుబాయ్‌లోని ఎమిరేట్స్ ఆక్షన్ అండ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) నిర్వహించిన వేలంలో AA8 నంబర్ కు అత్యధిక ధర పలికింది.
మొత్తం ఆదాయం '1 బిలియన్ మీల్స్' స్వచ్ఛంద ప్రచారానికి అందించబడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇది పోషకాహార లోపం ఉన్న పిల్లలకు, శరణార్థులకు, వలస వచ్చిన వారికి ఖర్చు చేస్తారు.
ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాలలో విపత్తులు మరియు సంక్షోభాల వల్ల ప్రభావితమైన వారికి ఆహారాన్ని అందించడానికి ఈ వేలాన్ని నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభంలో ప్రచారం ప్రారంభించినప్పటి నుండి 340 మిలియన్ల మంది అసహాయులకు భోజనం అందించడానికి సమానమైన నిధులు తాజా వేలంతో సేకరించబడ్డాయి.
రెండంకెల కార్ నంబర్ ప్లేట్లు F55 (4 దిర్హామ్ మిలియన్లు, V66 4 దిర్హామ్ మిలియన్లు) మరియు Y66 3.8 దిర్హామ్ మిలియన్లు వేలంలో విక్రయించబడ్డాయి.
ఇతర ప్లేట్లు చూసుకుంటే.. గత సంవత్సరం, సింగిల్ డిజిట్ ప్లేట్ నంబర్ AA9 38 మిలియన్ దిర్హామ్‌లకు (రూ. 79 కోట్లు) విక్రయించబడింది.