రాజ్యసభ సీటు కావాలా..? జస్ట్ రూ.100 కోట్లు మాత్రమే?

Update: 2022-07-25 14:57 GMT
మీకు గవర్నర్ పదవి కావాలా? లేదంటే ప్రతిష్టాత్మక రాజ్యసభ సీటు కావాలా? కేవలం రూ.100 కోట్లు మాత్రమే. ఇలా చెల్లిస్తే అలా ఇచ్చేస్తామంటూ ప్రజాప్రతినిధులను ఏమారుస్తున్నారు కేటుగాళ్లు. ఈ నయా దందా ఇప్పుడు దేశంలో చర్చనీయాంశమైంది. పోలీసుల వద్దకు చేరడంతో ఈ కొత్త దందా వెలుగుచూసింది.

నేతల ఆకాంక్షకు అనుగుణంగా మోసగాళ్లు తెలివిమీరుతున్నారు. ప్రజాప్రతినిధుల అవసరాలను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. చిల్లర దొంగతనాలు చేసే వారు కూడా కోట్ల రూపాయలకు ప్లాన్ చేస్తున్నారు. గవర్నర్ పదవి నుంచి.. రాజ్యసభ సీటు వరకూ అంగట్లో సరుకుగా అమ్మేస్తున్నారు. పెద్దల సభకు గౌరవం పొందేలా రాజ్యసభ సీట్లను బేరానికి పెడుతున్నారు. దీనికి జస్ట్ రూ.100 కోట్లు మాత్రమే అంటూ మెలికపెడుతున్నారు. ఈ మొత్తం చెల్లిస్తే రాజ్యసభ సీటునా? గవర్నర్ హోదాను పొందడమా? అన్నది డిసైడ్ చేసుకోవాల్సి ఉంది.

తాజాగా ఈ కొత్త దందా ముఠాను కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ గుట్టు రట్టు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. రాజకీయ పార్టీలు తమ పార్టీ వారిని పంపే రాజ్యసభ సీట్లను వీరు అమ్మడం ఏంటన్న దానిపై ఆరాతీస్తున్నారు. కేంద్రం అపాయింట్ చేసే గవర్నర్ గిరీని అమ్మకానికి పెట్టిన తీరుపై విచారణ జరుపుతున్నారు. అలాంటి వాటిని కూడా అమ్మకానికి పెట్టారు ఈ ముఠా సభ్యులు. దీంతో ప్రభుత్వ సంస్థల చైర్మన్లుగా నామినేటెడ్ పోస్టులను కూడా తామే నిర్ణయిస్తామంటూ నమ్మిస్తున్నారు.

ఇలా మాయమాటలు చెప్పి.. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులను మోసం చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఈ రాకెట్ తో సంబంధం ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. దీనికి అనుబంధంగా పలు చోట్ల దాడులు చేశామని తెలిపారు. నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేశామని.. కీలక సభ్యుడు పరారీలో ఉన్నట్టు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన కమలాకర్ ప్రేమ్ కుమార్ బంద్గర్, కర్ణాటకలోని బెళగావికి చెందిన రవీంద్ర విఠల్ నాయక్, ఢిల్లీ నేషనల్ క్యాపిటలర్ లోని మహేంద్ర పాల్ అరోరా, అభిషేక్ బూరా, మహ్మద్ ఇజాజ్ ఖాన్ లను అరెస్ట్ చేశారు.

కమలాకర్ సీబీఐ అధికారిగా నటిస్తూ ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వ అధికారులతో సంబంధాలను కొనసాగించాలని వివరించారు.
Tags:    

Similar News

ఇక ఈడీ వంతు