త్రీ ఇడియట్స్ సినిమా చూడని వారు ఉండరు. అందులో అమీర్ ఖాన్ పోషించిన సైంటిస్ట్ పాత్ర.. తాను ఇంజనీర్ అయినా.. అపదలో ఉన్న ఒక మహిళను రక్షించేందుకు డాక్టర్ గా వ్యవహరించి.. సులువుగా డెలివరీ చేయటమే కాదు.. తల్లిని.. పిల్లను కాపాడతారు. సినిమా టిక్ గా అనుకున్నప్పటికీ.. కాస్తంత మెదడును ఉపయోగిస్తే.. అపత్ కాలంలో ప్రాణాలు కాపాడటం ఎలా అన్నది చేతల్లో చేసి చూపించారో భారతీయ వైద్యుడు.
అతగాడి స్పందనతో విమానంలో ప్రయాణిస్తున్న రెండేళ్ల చిన్నారి ప్రాణాలు నిలవటమే కాదు.. విమానం దిగే సమయానికి తల్లితో ఆట ఆడుకునే పరిస్థితికి చేరుకోవటం విశేషం. ఇంతకీ సదరు భారతీయ డాక్టర్ ఏం చేశారో చూస్తే..
భారతీయ వైద్యుడు డాక్టర్ ఖుర్షీద్ న్యూయార్క్ లోని రోజ్ వెల్ పార్క్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో రోబోటిక్ సర్జరీ విభాగంలో పని చేస్తున్నారు. ఆయన స్పెయిన్ నుంచి యూఎస్ కు ఎయిర్ కెనడాలో ప్రయాణిస్తున్నారు.
ఇదే సమయంలో.. రెండేళ్ల చిన్నారి గాలి పీల్చుకోలేక తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నాడు. మరికాసేపు గడిస్తే అతని ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి. ఆస్తమా ఉన్న సదరు బాలుడ్ని రక్షించేందుకు ఖుర్షీద్ రంగంలోకి దిగారు. అయితే.. విమానంలో పెద్దవాళ్లకు పనికి వచ్చే ఆక్సిజన్ హీలర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో.. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ఖుర్షీద్ తన మెదడుకు పదును పెట్టి.. క్షణాల్లో ఓ ఐడియా వేసేశారు.
ఒక వాటర్ బాటిల్ ను కట్ చేసి ఆక్సిజన్ ట్యూబ్ ను తగిలించారు. ఒక వైపు ఆక్సిజన్ ట్యూబ్.. మరోవైపు బాటిల్ కు రెండో వైపు చిన్న రంధ్రం చేసి ఇన్ హీలర్ పంపారు. అయినప్పటికీ పిల్లాడి ఇబ్బందిని బయట పడకపోవటంతో.. చిన్న కప్పును తీసుకొచ్చి దాని వెనుక రంధ్రం చేసి దాన్ని.. వాటర్ బాటిల్ ను అనుసంధానం చేసి.. కప్పును ముక్కుకు దగ్గర పెట్టారు.
దీంతో.. సదరు చిన్నారి ఊపిరి పీల్చుకోవటం మొదలు పెట్టాడు. చిన్నారికి అవసరమైన ఆక్సిజన్ అందటంతో కాసేపటికి ఆ పిల్లాడు సర్దుకున్నాడు. అస్తమా నుంచి కోలుకొన్న ఆ చిన్నారి.. ఫ్లైట్ దిగే సరికి తల్లితో ఆడుకోవటం తనకు విపరీతమైన ఆనందాన్ని కలిగించిందని చెబుతున్నారు డాక్టర్ ఖుర్షీద్. సరైన సమయంలో తీసుకున్న సముచిత నిర్ణయం.. ఓ చిన్నారి ప్రాణాలు కాపాడిందని చెప్పాలి.