వద్దంటే కన్య పరీక్షలు

Update: 2015-10-16 22:30 GMT
ప్రపంచంలో మహిళా హక్కుల కోసం కృషి చేసే దేశాల్లో అగ్రస్థానంలో ఉండే స్వీడన్ లో కన్యత్వ పరీక్షలు కలకలం రేపుతున్నాయి. యువతులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా కన్యత్వ పరీక్షలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కుటుంబసభ్యులు - బంధువులు - లేదంటే భర్తలు - బాయ్ ఫ్రెండులు యువతులకు కన్యత్వ పరీక్షలు జరిపిస్తున్నారట... నిజానికి ఇలాంటి పరీక్షలు స్వీడన్ లో చట్ట విరుద్ధం. కానీ, కొందరు వైద్యులు మాత్రం అధిక మొత్తాలు తీసుకుని ఈ పరీక్షలు చేస్తున్నారు. దీనిపై ఇలాంటి బలవంతపు పరీక్షలకు గురైనవారు కొందరు ఆరోపణలు చేయడంతో పాత్రికేయులు స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు... ఇందులో కొందరు వైద్యులు అడ్డంగా దొరికిపోయారు.

యుక్త వయసు వచ్చిన వారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా కన్యత్వ పరీక్షలు చేస్తూ స్వీడన్ వైద్యులు కెమెరాలకు దొరికిపోయారు. స్వీడన్ లో గత కొంతకాలంగా వైద్యులపై కన్యత్వ పరీక్షలు చేస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీంతో స్వీడన్ కు చెందిన కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ కల్లా కఫ్తా(కోల్డ్ ఫ్యాక్ట్) సంస్థ రహస్య ఆపరేషన్ చేపట్టింది. కొన్ని ఆస్పత్రులను సెలక్ట్ చేసుకుని అక్కడ రహస్యంగా కెమేరాలు ఏర్పాటుచేశారు. ఆ తరువాత ఓ మహిళా జర్నలిస్టు  17 ఏళ్ల బాలికను తీసుకెళ్లి కన్యత్వ పరీక్షలు చేసి సర్టిఫికెట్ ఇవ్వాలని వైద్యులను కోరింది. కానీ, ఆ బాలిక వద్దువద్దంటున్నా వినకుండా వైద్యులు పరీక్షలు చేయడానికి రెడీ అయిపోయారు... ఇదంతా కెమెరాల్లో రికార్డయింది... ఇంకేముంది డాక్టర్ల దందా బయటపడింది.

కన్యత్వ పరీక్షలు చేయరాదన్న చట్టాన్ని లెక్కచేయకుండా వయోభేదం లేకుండా బాలికలకు కూడా వైద్యులు కన్యత్వ పరీక్షలు చేస్తున్నారు అక్కడ. ఈ వ్యవహారమంతా వెలుగుచూడడంతో స్వీడన్ ప్రభుత్వం ఆశ్చర్యపోయిందట. వెంటనే ఆ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని... ఈ పరీక్షలు చేసే డాక్టర్లపై యాక్షన్ తీసుకోవాలని ఆదేశించింది.
Tags:    

Similar News