తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. అంత ఈజీగా ఏ విషయంలోనూ స్పందించరు. అందునా.. కాంగ్రెస్ సీనియర్ల విషయంలోనూ ఆయన పెద్దగా స్పందించరు. అందరినీ ఒకేసారి.. ఏదో ఒక అవకాశం చూసుకుని ఉతికి ఆరేస్తారు. ఇక, ఇటీవలే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ఎంపీ రేవంత్ రెడ్డి విషయంలో ఇప్పటి వరకు కేసీఆర్ ఏనాడూ నోరు విప్పలేదు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు .. కూడా.. కింది స్థాయి నేతలకు పని అప్పగించారే తప్ప రేవంత్ విషయంలో నేరుగా కేసీఆర్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదు.
దీనికి కారణం.. కేసీఆర్.. తనంతటి వాడు.. రేవంత్ వంటి చోటా నేత గురించి మాట్లాడి పెద్దవాణ్ని చేయ డం ఎందుకు అనుకున్నారో ఏమో! ఇక, రేవంత్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి మూడు మాసాలు గడిచింది. ఈ మధ్య కాలంలో రేవంత్ అనేక సార్లు కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయినా కూడా కేసీఆర్ నేరుగా ఎక్కడా విమర్శలు చేయలేదు. అయితే.. కింది స్థాయి నేతలైన బాల్క సుమన్, గువ్వల బాలరాజు వంటివారిని ప్రోత్సహించి.. కామెంట్లు చేయించారు
అయితే.. అనూహ్యంగా రేవంత్ విషయంలో కేసీఆర్ ఇప్పుడు స్పందించడం ప్రారంభించారు. తాను ఢిల్లీ పర్యటనకు బయల్దేర బోతూ.. తొలిసారి రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో ఒక్కసారిగా.. కేసీఆర్‌లో ఏదో మార్పు కనిపించిందనే ప్రచారం సాగింది. ఇక, ఇప్పుడు రేవంత్‌కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లారు. హూజూరాబాద్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఖరారు విషయంపై చర్చించేందుకు రేవంత్ ఢిల్లీకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
అయితే.. సహజ. ధోరణిలో కేసీఆర్‌పై విమర్శలు చేశారు. ``సెప్టెంబరు 1 నుంచి కేసీఆర్ డిల్లీలోనే ఉన్నారు. ఒకవైపు తెలంగాణలో తీవ్ర వర్షాలు వచ్చి.. వరదలతో ఊళ్లకు ఊళ్లు మునిగిపోతున్నా.. ఆయన మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో ఏవో చీకటి ఒప్పందాలు చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. మోడీ-కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం`` అని విమర్శలు చేశారు. నిజానికి దీనిపైనా కేసీఆర్ స్పందిస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ..అనూహ్యంగా ఆయన స్పందించారు.
రేవంత్ కామెంట్లను టీవీల్లో చూసిన కేసీఆర్ వెంటనే ఆ కామెంట్లపై తన పీఆర్ వో ద్వారా వెంటనే వివరణ ఇచ్చుకున్నారు. ఢిల్లీ ఎందుకురావాల్సి వచ్చిందో వివరించారు. తెలంగాణకు ఉన్న పెండింగు పనులు పూర్తి చేయించుకునేందుకు తాను ఢిల్లీలో మకాం వేసినట్టు చెప్పుకొచ్చారు. అదేసమయంలో నిధులు, ఇతర ప్రాజెక్టులపై చర్చించేందుకు తాను ఢిల్లీలో ఉండాల్సి వచ్చిందని తెలిపారు.
అదేసమయంలో టీఆఆర్ ఎస్ నేతలు బీ వినోద్ కుమార్‌ను రేవంత్‌కు సరైన కౌంటర్ ఇవ్వాల్సిందిగా మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు గమనిస్తే.. గతంలో మాదిరిగా.. రేవంత్‌ను చోటా నేతగా కేసీఆర్ తీసిపారే పరిస్థితి లేదని ఆయన గ్రహించినట్టు తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు. దీనిని బట్టి.. మున్ముందు.. రేవంత్ వర్సెస్ కేసీఆర్.. మాటల తూటాలు పేలడం ఖాయమనే అంటున్నారు. మరి ఏం జరుగుతుంందో చూడాలి.