అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన `భారతీయ వ్యతిరేక పంథా` నిర్ణయాలను కొనసాగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే వలసలపై భారతీయుల లక్ష్యంగా తీసుకున్న నిర్ణయాలు కలకలం రేకెత్తిస్తుండగా ట్రంప్ మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అది కూడా తన సొంత మనిషికి చాన్స్ ఇవ్వడం కోసం నిర్దయగా నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో అత్యున్నత వైద్య పదవి అయిన సర్జన్ జనరల్ పదవి నుంచి భారత సంతతి వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తిని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మూర్తి స్థానంలో త సొంత మనిషిని త్వరలో ట్రంప్ నియమించుకున్నారు. అందులో భాగంగానే ఆయనను రాజీనామా చేయాలని కోరారు. వివేక్ మూర్తిని రాజీనామా చేయలని కోరిన విషయాన్ని అమెరికా ఆరోగ్య - మానవ సేవల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. మూర్తి సర్జన్ జనరల్ విధుల నుంచి రిలీవ్ అయ్యారని, కమిషన్డ్ కోర్ సభ్యుడిగా మాత్రం సేవలు అందిస్తారని ఆ ప్రకటన వివరించింది. ప్రస్తుతం డిప్యూటీ సర్జన్ జనరల్ గా ఉన్న రియర్ అడ్మిరల్ సిల్వియా ట్రెంట్ ఆడమ్స్‌ను వివేక్ మూర్తి స్థానంలో సర్జన్ జనరల్ గా నియమించినట్లు పేర్కొంది.
తాజా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో డాక్టర్ వివేక్ మూర్తిని అమెరికా సర్జన్ జనరల్ గా నియమించారు. 2014 డిసెంబర్ నెలలో డాక్టర్ వివేక్ మూర్తిని సర్జన్ జనరల్ గా నియమించాలని ఒబామా భావించినప్పుడు దానికి సెనేట్ 51-43 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ నేతృత్వంలోని గన్ అనుకూల లాబీ అప్పుడు మూర్తి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ సెనెట్ ఆమోద ముద్రతో మూర్తి ఎంపికయ్యారు. సర్జన్ జనరల్ పదవీకాలం నాలుగేళ్లు అయితే ముందస్తుగానే ఆయన పదవి వీడుతున్నారు. 37 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన సర్జన్ జనరల్ గా నియమితులయ్యారు. కాగా, ఈ పరిణామంపై డాక్టర్ మూర్తి స్పందించారు. ఇన్నాళ్ల పాటు ఇంత ప్రతిష్ఠాత్మకమైన పదవిలో తనను కొనసాగించడం తనకు చాలా గౌరవమని, అదృష్టమని డాక్టర్ వివేక్ మూర్తి ఫేస్‌బుక్ పోస్టింగులో పేర్కొన్నారు. అమెరికా లాంటి పెద్ద దేశం మొత్తానికి ఆరోగ్య విషయాలు చూసుకోవాలని అధ్యక్షుడు అడిగే వరకు ఎదగడం భారతదేశంలో ఒక పేద రైతు మనవడికి చాలా గౌరవమని మూర్తి పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం వలస వచ్చిన తన కుటుంబాన్ని ఆదరించి, తనకు ఈ విధంగా సేవ చేసే అవకాశం కల్పించినందుకు అమెరికాకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొంటూ తన హుందాతనంతో కూడిన స్పందనను తెలియజేశారు.
కాగా, డాక్టర్ మూర్తి తల్లిదండ్రులు కర్ణాటకకు చెందినవారు. ఆయన ఇంగ్లండ్‌లోని హడర్స్ ఫీల్డ్ లో జన్మించి, ఫ్లోరిడాలోని మియామీ ప్రాంతానికి మూడేళ్ల వయసులో వలస వెళ్లారు. యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ - యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ నుంచి హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ లో ఎంబీఏ చేశారు. ప్రస్తుతం ఆయన బోస్టన్ లోని బ్రిగామ్ - ఉమెన్స్ ఆస్పత్రిలో ఫిజీషియన్ గా పనిచేస్తున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో వైద్య అధ్యాపకుడిగా కూడా పనిచేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/