ఔను మీరు సరిగ్గానే చదివారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ ఇంతెత్తున్న ఎగిరిపడే...కొరియాదేశమే ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే ఆయన కోసం ఈ గళం వినిపించింది ట్రంప్ అంటే భగ్గుమనే ఉత్తరకొరియా కాదు. ఆ దేశం పక్కనున్న దక్షిణ కొరియా. ఎందుకీ కోరిక కోరిందో తెలుసా? ఉత్తరకొరియా రథసారథి కిమ్ జోంగ్ ను ఓ దారికి తెచ్చినందుకట. ఇంతకీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలని సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ కోరారు. కొరియా ద్వీపకల్పంలో అణ్వాయుధాల అంశం ట్రంప్ కారణంగానే చల్లబడింది కాబట్టి నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇటీవలే ఉభయ కొరియాల మధ్య చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. గత ఏడు దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా మెలిగిన దాయాది దేశాలు శాంతి దిశగా ముందడుగు వేశాయి. ఈ మేరకు కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధరహితంగా మార్చేందుకు నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్, సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్ ఇన్‌ల మధ్య అంగీకారం కుదిరింది. 65 ఏళ్ల తర్వాత ఇరు దేశాల మధ్యనున్న సైనిక విభజన రేఖ వద్ద కలుసుకున్న దేశాధినేతలు కరచాలనం చేసి ఒకరి భూభాగంలోకి మరొకరు అడుగుపెట్టారు. కిమ్ ఆహ్వానం మేరకు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ ఉత్తర కొరియా భూభాగంలోకి వెళ్లగా.. ఆ తర్వాత కిమ్ దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడిచారు. ఉభయ కొరియా సరిహద్దుల్లోని పాన్‌మున్‌జోమ్‌లోని మూడంతస్థుల భవనం పీస్ హౌస్ కిమ్, మూన్ భేటీకి వేదికైంది. కిమ్, మూన్‌ల మధ్య జరిగిన చారిత్రక భేటీలో ఇద్దరు నేతలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో దశలవారీగా ఆయుధాల తగ్గింపుతో పాటు ప్రతీకార చర్యలకు స్వస్తిపలకడం, సరిహద్దులో ఉద్రిక్త వాతావరణాన్ని తొలగించి శాంతియుత వాతావరణం నెలకొల్పడం, అమెరికాతో చర్చలు తదితర అంశాలున్నాయి. కిమ్ దాదాపు గంటా 40 నిమిషాల సేపు దక్షిణ కొరియాలో గడిపారు. కొరియా యుద్ధం అనంతరం 65 ఏళ్ల తర్వాత నార్త్ కొరియా అధ్యక్షుడు సౌత్ కొరియాలో అడుగుపెట్టడం విశేషం.
ఇలా సుదీర్ఘ కాలం నాటి సమస్యకు పరిష్కారం దక్కడం వల్ల సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ నోబెల్ బహుమతి డిమాండ్ చేశారు. మూన్ జే ఇన్ కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై స్పందించినట్లు ఆ దేశ ప్రతినిధులు వెల్లడించారు. ట్రంప్ పూర్తిగా శాంత స్వభావం కలవారని.. ఆయన కారణంగా నార్త్ కొరియా అణ్వాయుధాల పరీక్షా కేంద్రాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. దశాబ్దాలుగా కొరియా దేశాల మధ్య యుద్ధ వాతావారణాన్ని పూర్తిగా నివారించింది అమెరికా అధ్యక్షుడేనని సౌత్ కొరియా తెలిపింది. ఈ అనూహ్య డిమాండ్‌కు నోటెల్ కమిటీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.