ప్యారిస్ మీద జరిగిన ఉగ్రదాడి కొత్త చర్చతో పాటు.. సరికొత్త పరిణామాలకు దారి తీసేలా కనిపిస్తోంది. యూరప్.. అమెరికాతో పాటు పలు ప్రాశ్చాత్య దేశాల మీద తీవ్ర ప్రభావం చూపినట్లుగా కనిపిస్తోంది. ముస్లింల మీద అనుమానాలతో పాటు.. పలు సందేహాల్ని వ్యక్తం చేసేందుకు.. బయటకు చెప్పేందుకు ఎలాంటి మొహామాటాన్ని ప్రదర్శించని కొత్త వైఖరి తాజాగా మొదలైంది. ఇదే వైఖరి మరింత బలపడితే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలకు సరికొత్త చిక్కులు తీసుకురావటం ఖాయమన్న భావన కనిపిస్తోంది.
తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న డొనాల్డో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అమెరికాలోని కొన్ని మసీదుల్ని మూసేయాలని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. మసీదుల్లో జరిగే చర్చలు.. వాదనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఉగ్రవాద దాడులను ఎదుర్కొనేలా అమెరికాలోని వ్యవస్థలు తమ పని తీరును ప్రదర్శించటం లేదన్న అసంతృప్తిని వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్.. మసీదుల్లో అతివాద కార్యకలాపాలు కట్టడి చేస్తేనే ఉగ్రవాద చర్యల్ని అడ్డుకునే అవకాశం ఉందన్న వాదనను వినిపిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలోని కొన్ని మసీదులను మూసేయాలని వ్యాఖ్యానించారు.
మరోవైపు.. ఫ్రాన్స్ ప్రధానమంత్రి వాల్స్ కూడా ఇదే వైఖరిని వెల్లడించటం విశేషం. వాస్తవానికి ఉగ్రవాద చర్యల్ని కట్టడి చేసే పనిలో భాగంగా అతివాద ముస్లిం తెగలకు చెందిన మసీదుల్ని మూసి వేయాలని వాల్స్ వ్యాఖ్యనించారు. ఆయన చేసిన వ్యాఖ్య నేపథ్యంలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న డొనాల్డ్ ను ప్రశ్నించినప్పుడు ఆయన కూడా ఫ్రాన్స్ ప్రధానమంత్రి మాటనే చెప్పటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ప్యారిస్ ఉగ్రదాడి ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన నేతల మైండ్ సెట్ మార్చటంతో పాటు.. ముస్లింల పట్ల తమ వైఖరిని మార్చుకున్న ధోరణి కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.