ట్రంప్‌ కు ఇంత‌కంటే అవ‌మానం ఏముంటుంది?

Update: 2017-03-26 06:12 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు మరో అవమానకరమైన ఓటమి ఎదురైంది. ఒబామా కేర్ పథకాన్ని రద్దుచేసేందుకు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. ఈ పథకాన్ని రద్దు చేసేందుకు ప్రవేశపెట్టిన బిల్లుకు రిపబ్లికన్ల ప్రాబల్యం అధికంగా ఉన్న అమెరికా ప్రతినిధుల సభ (పార్లమెంట్ దిగువ సభ)లోనే మద్దతు లభించలేదు. దీంతో అధికార రిపబ్లికన్ పార్టీ ఆ బిల్లును ఉపసంహరించుకున్నారు. తద్వారా ట్రంప్‌ కు భంగపాటు తప్పలేదు. ఈ ఓటమితో ఆగ్రహం చెందిన ట్రంప్ - దేశంలో దుష్పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయంటూ అమెరికన్లను హెచ్చరించారు.

ఒబామా కేర్ పథకం స్థానంలో సరికొత్త హెల్త్‌ కేర్ బిల్లును ఆమోదింపజేసేందుకు అవసరమైనన్ని ఓట్లను కూడగట్టడంలో ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ ర్యాన్ విఫలమయ్యారు. సొంత పార్టీకి చెందిన కొంత మంది సభ్యులు, ప్రత్యేకించి ఫ్రీడమ్ కాకస్ పేరుతో ప్రత్యేక గ్రూపుగా ఏర్పడిన రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడమే ఇందుకు కారణం. మొత్తం 435 మంది సభ్యులున్న అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీకి 235 మంది సభ్యుల సాధారణ మెజార్టీ ఉంది. అయినప్పటికీ ఒబామాకేర్ పథకం రద్దును సొంత పార్టీ సభ్యులే వ్యతిరేకించడంతో ఈ బిల్లును ఆమోదింపజేసేందుకు అవసరమైన 215 మంది సభ్యుల ఓట్లను ర్యాన్ కూడగట్టలేకపోయారు. దీంతో ట్రంప్‌కు అవమానం ఎదురవకుండా చూసేందుకు ఈ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ర్యాన్ ప్రకటించారు. మన దేశంలో మాదిరిగా అమెరికాలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం లేదు. దీంతో ఆ దేశ పార్లమెంట్ సభ్యులు ఏదైనా బిల్లుపై ఓటింగ్‌ లో పాల్గొన్నప్పుడు పార్టీ నాయకుల ఆదేశాలకు కట్టుబడకుండా తమ అభీష్టం మేరకు ఓటు వేసే అవకాశం ఉంటుంది.

వలస విధానాలపై రెండుసార్లు కోర్టుల నుంచి మొట్టికాయలు తిని పరాభవం పాలైన ఆయనకు హెల్త్ కేర్ విషయంలోనూ అలాంటి పరిస్థితే ఎదురైంది. గురువారమే సభలో బిల్లును ప్రవేశపెట్టినా మెజారిటీ లేక బిల్లుపై ఓటింగ్‌ ను ఒక రోజుపాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ సొంత పార్టీ నేత‌లే మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డంతో ట్రంప్‌కు ఉన్న మ‌ద్ద‌తును తెలియ‌జేస్తుంద‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News