ట్రంప్‌ పై అమెరిక‌న్ల క‌న్నెర్ర‌..మ‌నోళ్ల‌కు లాభ‌మే

Update: 2018-12-24 10:27 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తీరుపై ఆ దేశంలోనే అసంతృప్తులు పెల్ల‌బుకుతున్నాయి. ఆయ‌న‌ కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన వీసా నిబంధ‌న‌ల‌ను అక్క‌డి విశ్వ‌విద్యాల‌యాలు వ్య‌తిరేకిస్తున్నాయి. `విదేశీ విద్యార్థుల కోసం చాలా క‌ఠిన‌మైన చ‌ట్టాల‌ను త‌యారు చేశారు. దీని వ‌ల్ల అమెరికా ఉన్న‌త విద్యా వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం ఉంటుంది`అని సుమారు 65 ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీలు ఆవేద‌న వ్య‌క్తం చేశాయి. హార్వ‌ర్డ్‌ - మిట్‌ - కార్నెల్‌ - యేల్‌ - ప్రిన్స్‌ ట‌న్ లాంటి వ‌ర్సిటీలు కూడా ట్రంప్ వీసా విధానాన్ని త‌ప్పుప‌ట్టాయి. వీసా విధానాన్ని వ్య‌తిరేకించిన ఆ వ‌ర్సిటీలో.. కోర్టును కూడా ఆశ్ర‌యించాయి.

ట్రంప్ స‌ర్కారు ఇటీవ‌ల విడుద‌ల చేసిన కొత్త వీసా నిబంధ‌న‌ల ప్ర‌కారం.. విదేశీ విద్యార్థులు ఎవ‌రైనా త‌మ చ‌దువు కాలం ముగిసినా.. లేక వీసా తేదీ ముగిసిన ఇక నుంచి ఆ దేశంలో ఉండ‌డానికి వీలు లేదు. అలా గ‌డువు కాలం ముగిసిన విద్యార్థుల‌ను వెంట‌నే దేశం నుంచి వారివారి స్వంత దేశాలకు పంప‌డం జ‌రుగుతుంది. డిపార్ట్‌ మెంట్ ఆఫ్ హోమ్‌ ల్యాండ్ సెక్యూర్టీ ఆ కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాల్సి ఉంటుంది. అయితే గ‌తంలో ఈ నిబంధ‌న‌లు మ‌రోలా ఉండేవి. ఒక‌వేళ విదేశీ విద్యార్థుల చ‌దువు ముగిసినా - లేక వీసా గ‌డువు ముగిసినా - స‌ద‌రు విద్యార్థి ఆరు నెల‌ల వ‌ర‌కు అమెరికా ఆశ్ర‌యం పొందే వీలు ఉండేది. ఇప్పుడు కొత్త వీసా విధానంతో విదేశీ విద్యార్థుల ఆశ‌ల‌పై ట్రంప్ నీళ్లు చల్లారు. కానీ ఈ ప‌ద్ధ‌తి అమెరికా విద్యా వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీస్తుంద‌ని మేటి వ‌ర్సిటీలు ఆరోపిస్తున్నాయి. గ‌త ఏడాది విదేశీ విద్యార్థుల వ‌ల్ల అమెరికాకు సుమారు 39 బిలియ‌న్ డాల‌ర్ల ఆదాయం వ‌చ్చింది.

కాగా  - భార‌తీయ విద్యార్థులు పెద్ద ఎత్తున అమెరికాలో విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. తాజాగా యూనివ‌ర్సిటీలు ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డాన్ని ట్రంప్ స‌ర్కారు సీరియ‌స్‌ గా తీసుకొని నిబంధ‌న‌లు మార్చితే మన విద్యార్థుల‌కు కూడా మేలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News