అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఇటీవలి కాలంలో ఇబ్బందిగా మారిన న్యాయవ్యవస్థలో తన ముద్ర వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 13న యూఎస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆంటోనియో స్కలియా మృతి చెందారు. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తన సన్నిహితుడు, జస్టిస్ నీల్స్ గోర్ సచ్ ను ప్రకటించారు. అయితే ఈ పరిణామంపై విపక్షాలు ఆశ్చర్యపోతున్నాయి. న్యాయవ్యవస్థను సైతం ప్రభావితం చేయగల ననే ట్రంప్ ఆలోచన ధోరణికి కళ్లెం వేయాలని డెమోక్రట్లు నిర్ణయించుకున్నారు.
యూఎస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా గోర్ సచ్ ను నియమించాలంటే దానికి సెనెట్ ఆమోదం తప్పనిసరి. యూఎస్ సెనెట్ లో సెనెటర్ల సంఖ్య 100 ( రిపబ్లికన్ పార్టీ -52 - డెమోక్రటిక్ పార్టీ -46 - ఇండిపెండెంట్స్ -2 ). వారిలో 60 మంది సెనెటర్లు ట్రంప్ నిర్ణయానికి మద్దతు తెలిపినట్టయితేనే గోర్ సచ్ ను యూఎస్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించే మార్గం సుగమం అవుతుంది. అమెరికా అధ్యక్షుడికి ప్రస్తుతం 52 మంది సెనెటర్ల మద్దతు మాత్రమే ఉన్నది. మరో 9 మంది సెనెటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు రిపబ్లికన్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఒకవేళ మెజారిటీ సెనెటర్లు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టయితే...చట్టసవరణలు చేసైనాసరే గోర్ సచ్ ను యూఎస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని భావిస్తోంది. కాగా, సెనెట్ నియమనిబంధనల్లో మార్పులు చేయాలని 2013లో డెమోక్రటిక్ పార్టీ సెనెటర్ హారీ రెయిడ్ ప్రయత్నించారు. సెనెట్ లో మెజారిటీ కోసం గతంలో నిర్ణయించిన మ్యాజిక్ ఫిగర్ ను 60 నుంచి 51కి తగ్గించాలనే ప్రతిపాదన ను ప్రవేశపెట్టి విఫలమయ్యారు. న్యాయమూర్తుల నియా మకం అంశంలో తన సిఫార్సులను మినహాయించాలని కో రారు.
అమెరికా చరిత్రలో సుప్రీంకోర్టు జడ్జి నామినీ ఎంపిక కోసం 60 మంది సెనెటర్లు కేవలం నాలుగు సార్లు మాత్రమే మద్దతిచ్చారని వైట్ హౌస్ అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ తెలిపారు. సెనెట్ నిబంధనల్లో సవరణలు చేయాలని భావిస్తున్నామని అన్నారు. కాగా, గోర్ సచ్ ను యూఎస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించి తీరుతామని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పేర్కొన్నారు. యూఎస్ సుప్రీంకోర్టు జడ్జీగా గోర్ సచ్ ను నియమించాలనే ట్రంప్ నిర్ణయానికి మద్దతిస్తున్నట్టు డెమోక్రటిక్ పార్టీ సెనెటర్లు జో మాంచిన్ - హీదీ హీత్ కాంప్ లు ప్రకటించారు. ' సెనెట్ నిబంధనలను మార్చే అవసరం లేదు. యూఎస్ సుప్రీంకోర్టు నామినీగా మరో వ్యక్తి పేరు సిఫార్సు చేస్తే సరిపోతుంది.' అని సెనెట్ మైనార్టీ నేత చక్ స్కమ్మర్ అభిప్రాయపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/