రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కి సంబంధించి ప్రతీ వార్తా అమెరికాలో సంచలనమే అవుతోంది! ప్రస్తుతం ఆయన భార్య మెలనియాకు సంబంధించిన చిత్రాలు హాట్ టాపిక్ గా మారాయి. కాబోయే అమెరికా తొలి మహిళ అపురూప దృశ్యాలు అనే క్యాప్షన్ తో ద న్యూయార్క్ పోస్ట్ పత్రిక సంచలన చిత్రాలను ప్రచురించింది! అవేంటంటే.. మెలనియా నగ్న చిత్రాలు! 1990లలో మెలనియా మోడలింగ్ చేసేవారు. దాన్లో భాగంగా వివిధ మ్యాగజైన్ల కోసం చాలా ఫొటో షూట్స్ చేశారు. 1995లో ఫ్రెంచ్ కి చెందిన ఒక మెన్స్ మ్యాగజైన్ కోసం ఆమె నగ్నంగా కొన్ని ఫోజులు ఇచ్చారు. వాటిలో ఒక చిత్రాన్ని మొదటి పేజీలో పెద్ద సైజులో పెట్టి, మిగతావి లోపలి పేజీల్లో పబ్లిష్ చేస్తూ ఆదివారం టాబ్లాయిడ్ లో ప్రచురితం అయ్యాయి. దీంతో మెలనియా న్యూడ్ పిక్స్ హల్ చల్ షురూ అయింది. ఇంటర్ నెట్ లో మెలనియాకు సంబంధించిన చాలా నగ్న చిత్రాలు ఇప్పుడు వెలుగులోకి రావడం విశేషం.
ఈ నగ్న చిత్రాలు ట్రంప్ కి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే, వీటిని ఇంటర్ నెట్ నుంచి తొలిగించే అవకాశంపై నిపుణులను ట్రంప్ ఆశ్రయించినట్టు కూడా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అయితే, మెలనియా నగ్న చిత్రాలు నెట్ లో చాలానే ఉన్నాయనీ, అన్నీ తొలగించడం కష్టసాధ్యమైన పని అని నిపుణులు తేల్చినట్టు చెబుతున్నారు. దీంతో ఈ న్యూడ్ స్టిల్స్ ను సమర్థించుకునే విధంగా ట్రంప్ అభిమానులు కొందరు మాట్లాడుతున్నారు. ఈ నగ్న చిత్రాలను తీసిన కెమెరా మేన్ మాట్లాడుతూ మెలనియా చాలా ఫ్రొఫెషనల్ మోడల్ అనీ - కెమెరా ముందు చాలా కంఫర్టబుల్ గా ఉండేవారనీ - తన అందాలను ప్రదర్శించుకునే స్వేచ్ఛ ఆమెకి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ట్రంప్ సలహాదారుల్లో ఒకరైన జాసన్ మిల్లర్ కూడా ఈ నగ్న చిత్రాలపై స్పందిస్తూ... ఇలాంటి కథనాల వల్ల ట్రంప్ కి వచ్చే ఇబ్బంది ఏమీ లేదని కొట్టి పారేశారు. దీన్లో సిగ్గు పడాల్సిన అవసరం ఏమీ లేదనీ, అందాల ప్రదర్శన అనేది ఒక కళగా మాత్రమే చూడాలనీ మీడియాతో మిల్లర్ చెప్పారు. 1990లలో మోడలింగ్ లో ఉండగానే ట్రంప్ తో ఆమెకి పరిచయం ఏర్పడింది. 1998లో న్యూయార్క్ లో జరిగిన ఒక ఫ్యాషన్ పార్టీలో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ తరువాత, 2005లో ఫ్లోరిడాలో ఉన్నరిసార్ట్ లో ట్రంప్ తో మెలనియా పెళ్లి జరిగింది. మోడలింగ్ కెరీర్ లో ఉన్నప్పుడు ఇలాంటి ఫొటో షూట్స్ సర్వ సాధారణ విషయంగా అమెరికా సమాజం చూస్తుందనీ, ట్రంప్ భార్య నగ్న చిత్రాల వల్ల ఆయన ఇమేజ్ కి వచ్చే ఇబ్బంది లేదని అంటున్నారు!