ఆన్ లైన్ లో పర్సనల్ ఫొటోలు - వీడియోలు షేర్ చేయొద్దు

Update: 2020-05-26 01:30 GMT
పొద్దున లేస్తే చాలు.. ఫేస్ బుక్ లో పోస్టు.. వాట్సప్ లో స్టేటస్.. పర్సనల్ ఫొటోలు, వీడియోలు అన్నీ షేర్ చేస్తారు. ఇక స్నేహం పేరుతో ఫ్రెండ్స్ కు పర్సనల్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకుంటారు. ఇదే వారి కొంపముంచుతోంది.

టీనేజర్లు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్ చేయవద్దని.. బ్లాక్ మెయిల్ కు గురికావద్దని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సూచించింది.

ఢిల్లీలో ‘బాయ్స్ లాకర్ రూం’ పేరుతో కొంత మంది టీనేజీ విద్యార్థులు ఇన్ స్టాగ్రామ్ గ్రూపును ఏర్పాటు చేసి బాలికల అభ్యంతరక ఫొటోలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు షేర్ చేసి కేసుల దాకా వెళ్లిన వ్యవహారంతో సీబీఎస్ ఈ ప్రకటన చేసింది.

ఈ సందర్భంగా ఆన్ లైన్ లో చేయాల్సినవి.. చేయకూడని విషయాల గురించి ఈ హ్యాండ్ బుక్ లో విద్యార్థులు, తల్లిదండ్రులకు కొన్ని మార్గదర్శకాలు సూచించింది. ఎవరితోనూ సోషల్ మీడియాలో మన పర్సనల్ ఫొటోలు, వీడియోలు పోస్టు చేయవద్దని తెలిపింది. లైంగికంగా మానసికంగా  వేధించడానికి సైబర్ నేరగాళ్లు నకిలీ ఖాతాలు సృష్టించి ఫొటోలు వీడియోలు కాజేసి బ్లాక్ మెయిల్ చేస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Tags:    

Similar News