ఏపీలో కరోనా అలజడి సృష్టిస్తుంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. తాజాగా ఏపీలో మరో 17 పాజిటివ్ కేసులు నమోదుకాగా మొత్తం కేసులు 40కు చేరాయి. ప్రకాశం జిల్లాలో ఏకంగా 8 కేసులు.. గుంటూరు జిల్లాలో 5.. అనంతపురం 2.. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఒకటి చొప్పున కేసులు ఉన్నాయి. ఈ పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీలో తబ్లిగి జమాత్ కు వెళ్లి వచ్చిన వ్యక్తులు.. వారి కుటుంబ సభ్యులే . ఇంకా కొందరి శాంపిల్స్ కు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. గత రాత్రి నుండి మొత్తం 164 నమూనాలను పరీక్షించారు, వాటిలో 147 మందికి నెగటివ్ రాగా, 17 మందికి పాజిటివ్ అని తేలింది. సానుకూలంగా ఉన్నాయి
కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ..ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ కే శ్రీనాథ్‌రెడ్డిని పబ్లిక్ హెల్త్ అడ్వైజర్ గా నియమించింది. ఆయన గతంలో ఎయిమ్స్ ఢిల్లీలో కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేశారు. శ్రీనాథ్ రెడ్డి కి వైద్యుడిగా అపార అనుభవం ఉండటంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. అయన మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం కానున్నట్లు సమాచారం.
ఢిల్లీలో మర్కజ్ లో ప్రార్థనల కోసం వెళ్లిన వారిలోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మార్చి 13-15 మధ్య ఢిల్లీలో నిర్వహించిన ఈ ప్రార్థనల్లో 2000 మంది పాల్గొనగా.. విదేశాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేసియా, కిరిగిస్థాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. 2 వేల మంది భారతీయులు ఈ ప్రార్థనల్లో పాల్గొనగా.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.