మందులేక పిచ్చోళ్లుగా..ఎర్రగడ్డకు పెరుగుతున్న బాధితులు

Update: 2020-03-30 09:10 GMT
దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో వైన్స్‌ దుకాణాలు మూతపడ్డాయి. దీంతో బ్లాక్‌ మార్కెట్‌ కూడా కొనసాగడం లేదు. దీంతో ఎక్కడా చుక్క మందు కూడా లభించడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో సాధారణ రోజుల్లో ఏరులై పారే మద్యం ఇప్పుడు అస్సలు ఎక్కడా దొరకడం లేదు. ఈ నేపథ్యంలో మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు చుక్క పడనిది నిద్ర పట్టని బాధితులు ఎంతో మంది ఉన్నారు. వారంతా ఇప్పుడు ఇళ్లల్లో ఉండలేకపోతున్నారు. నాలుక మందు కోసం ఎదురుచూస్తోంది. సాధారణంగా ప్రజలు మందుకు అలవాటు పడ్డారు. రోజుకింత అని పుచ్చుకునే వారు ఎందరో ఉన్నారు. సంపన్న వర్గం.. కూలీనాలీ చేసే వారు ఎవరైనా తెలంగాణలో మందు లేనిది ఉండరు. అలాంటి వారు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా పేదలు మందులేక తీవ్రంగా సతమతమవుతున్నారు. ఉదయంతా రెక్కల కష్టం చేసి సాయంత్రం కాగానే ఓ పెగ్‌.. ఓ బీర్‌ తాగేసి కడుపు నిండా తిని ఆ కష్టం మరిచి కంటి నిండా నిద్రపోతుంటారు. ఇది రోజు జరిగే తంతు. ప్రస్తుతం ఇది కట్టుతప్పింది. రెగ్యులర్‌గా మందు తాగే వారు ఇప్పుడు మందు లభించకపోవడంతో వారి మానసిక పరిస్థితి మారిపోయింది. మందులేక విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. శరీరంలో నిత్యం మందుకు అలవాటుపడింది. ఇప్పుడు మందు లేక శరీరం వారికి సహకరించడం లేదు. అవయవాలతో పాటు వారి మానసిక పరిస్థితి సక్రమంగా పని చేయడం లేదు. ఈ క్రమంలో వారు వింతగా ప్రవర్తిస్తున్నారు. పిచ్చిగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నారు. కొందరు మద్యం లభించక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. అయితే పెద్ద సంఖ్యలో మాత్రం ప్రజల మానసిక పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలో ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రి (పిచ్చాస్పత్రి)కి బాధితులు పెరుగుతున్నారు.

మూడు రోజులుగా ఈ ఆస్పత్రికి ఓపీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 100 కేసులు నమోదయ్యాయి. మందు లభించక వింతగా ప్రవర్తిస్తున్నారని స్థానిక వైద్యుల సలహాతో కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రికి చేరుకుంటున్నారు. అలా చేరుకున్న వారికి వైద్యులు పరీక్షిస్తున్నారు. వారి మానసిక పరిస్థితి ఆ విధంగా మారడానికి కారణాలు తెలుసుకుంటున్నారు. ఈ మేరకు ఆ బాధితులకు కౌన్సెలింగ్‌ కూడా ఇస్తున్నారు. ఈ విధంగా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గంటల పాటు వైన్స్‌ దుకాణాలు తెరవాలనే డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది. మందు లేక జీవించలేమని ప్రజలు పేర్కొంటున్నారు. మహిళలు కూడా కోరుతుండడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
Tags:    

Similar News