కొడుక్కి పెళ్లిచేస్తున్న సంబరంలో ఆ తండ్రి ఉన్నాడు! ఆ వివాహానికి హాజరైన అతిథులను ఆహ్వానిస్తూ, పలకరిస్తూ సందడిచేస్తున్నాడు. ఒకవైపు డీజే మ్యూజిక్ హడావిడి, మరోవైపు కురాళ్ల చిందులు! ఇంత హడావిడిగా సాగుతున్న వివాహంలో ఉన్నట్లుండి తుపాకీ శబ్ధం... తేరుకుని చూసే సరికి పెళ్లికొడుకు తండ్రికి పాయింట్ బ్లాంక్ లో తుపాకీ గుండు దూసుకుపోయింది, క్షణాల్లో అతడు మృతి చెందాడు!
వివరాళ్లోకి వెళితే... ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఎంతో వైభవంగా జరుగుతున్న ఒక వివాహ వేడుకకు కొంతమంది యువకులు హాజరయ్యారు. వారంతా ఫూటుగా తాగి ఉన్నారు. మామూలుగా తాగితేనే పెళ్లి కిక్ లో మరింత కిక్ ఎక్కుతుంది. అటువంటిది పెళ్లికి హాజరవడమే ఫూటుగా తాగి హాజరయ్యారు! ఇంతలో డీజే హడావిడి కూడా తోడవడంతో వీరి రచ్చ పీక్ కి వెళ్లిపోయింది. అయితే వీరి అల్లరి శృతిమించిందని గ్రహించిన పెళ్లికొడుకు తండ్రి డీజే ని ఆపెయ్యించేశాడు. దీంతో తాగుబోతు కుర్రాళ్ల మత్తుకు తోడు పట్టరాని కోపం కూడా తోడయ్యింది. దీంతో వారిలో ఒక కుర్రాడు తుపాకీ తీసి పెళ్లికొడుకు తండ్రిని పాయింట్ బ్లాంక్ లో కాల్చేశాడు! దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు!