లాక్ డౌన్ లో హైద‌రాబాదీయులకు ఇదేం పోయేకాలం ... ఏం చేసారంటే !

Update: 2020-04-16 09:50 GMT
ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించింది. ఈ లాక్ డౌన్ వల్ల అనేక మంది ఇబ్బందులకు గురౌతున్నారు. కానీ , ఈ మహమ్మారి నుండి మన ప్రాణాలని కాపాడుకోవాలంటే మరో మార్గం లేకపోవడంతో . కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఈ తరుణంలోనే ప్రజల అవసరాల కోసం కొన్నింటికి మినహాయింపు ఇచ్చారు. వాటిల్లో ముఖ్యంగా డెలివరీ యాప్స్ కి ఇప్పుడు భీభత్సమైన క్రేజ్ ఉంది.

వేడి వేడి ఆహారాన్ని నిమిషాల్లో డెలివ‌రీ చేసే యాప్స్‌ కు మన దేశంలో భారీ డిమాండ్ ఉంది. అయితే లాక్‌ డౌన్ వ‌ల్ల ఏర్ప‌డిన ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ యాప్స్ నిత్యావ‌స‌రాల‌ను కూడా డెలివ‌రీ చేయ‌డానికి ఒకే చెప్పాయి. అయితే కిరాణా సామాగ్రి నుంచి ఆహారం వ‌ర‌కు అన్నింటినీ క్ష‌ణాల్లో తెచ్చి ప‌ట్టే యాప్‌ డుంజో. ఇది హైదరాబాద్ క‌న్నా ముంబై, చెన్నై న‌గ‌రాల్లో బాగా పాపుల‌ర్‌ . డుంజో గ‌త నెలలో జ‌నాలు ఫార్మ‌సీకి సంబంధించి ఏ వ‌స్తువుల‌ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేశార‌న్న విష‌యాన్ని వెల్ల‌డించింది.

డుంజో వెల్లడించిన వివరాల ప్ర‌కారం చెన్నై, జైపూర్‌ వాసులు హ్యాండ్‌ వాష్‌ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేశారు. త‌ద్వారా క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు శుభ్ర‌తే ప్ర‌ధాన అవ‌స‌రమ‌ని గుర్తించారు. ఇక ఇదే డుంజో యాప్ బెంగ‌ళూరు, పుణె న‌గ‌రాల్లో ప్రెగ్నెన్సీ కిట్ల‌ను అధికంగా డెలివ‌రీ చేశారు. అన్నింటిక‌న్నా భిన్నంగా ముంబై వాసులు డుంజో ద్వారా ఎక్కువగా కండోమ్స్ ను ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. దీనితో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇదేం పోయేకాలం అని సోష‌ల్ మీడియాలో నెటిజన్స్ నోరెళ్ల‌బెడుతున్నారు. ఇక హైద‌రాబాద్ విష‌యానికొస్తే మ‌న భాగ్య‌న‌గ‌ర వాసులు ఐ-పిల్‌ అనే గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల‌ను విచ్చ‌ల‌విడిగా కొంటున్నారు. విన‌డానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇదే నిజ‌మ‌ని డుంజో తెలిపింది. హైదరాబాద్ లో గత నెల రోజుల్లో ఈ ఐ-పిల్‌ నే ఎక్కువగా డెలివరీ చేసినట్టు తెలిపింది.
Tags:    

Similar News