కండోమ్ యాడ్... కుమ్మేస్తున్న క్రికెటర్లు!

Update: 2016-10-26 07:01 GMT
ఐపీఎల్ పుణ్యమా అని వెస్టిండీస్ క్రికెటర్లకు భారత్ బాగా అలవాటైపోయింది. ఇదే క్రమంలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి కూడా వెస్టిండీస్ క్రికెటర్లు బాగా దగ్గరైపోయారు. మన క్రికెటర్లతో ఇండియాలో కలిస్తే చాలు పబ్బులు, చిందులూ, సోషల్ సర్వీస్ ప్రోగ్రాంస్, టీవీ రేడియో షోస్ ఈమద్య హీరోయిన్స్ తో స్పెషల్ లంచ్ కార్యక్రమాలు... ఒక్కమాటలో చెప్పాలంటే భారత్ కు వీరు, వీరికి మనవాళ్లూ బాగా అలవాటైపోయారు. ఇదే క్రమంలో క్రికెట్ మైదానంలోనూ, బయటా కూడా వీరి స్పెషల్ డాన్స్ కు స్పెషల్ గా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవారిలో క్రిస్ గేల్, డ్వాన్ బ్రావో ఒకరు!!

మైదానంలో తమ డాన్స్ మూమెంట్స్ తో వెస్టిండీస్ క్రికెటర్లు డ్వాన్ బ్రావో, క్రిస్ గేల్ లు ఇప్పటికే అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. వీళ్లలోని ఆ టాలెంట్ ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఒక కండోమ్ కంపెనీ గుర్తించింది. దీంతో వీరి నాట్య ప్రతిభని వాడేసుకుంటోంది. ఈ క్రమంలో వీళ్లను బ్రాండ్ అంబాసిడర్లు నియమించుకున్న ఒక కండోమ్స్ సంస్థ వీళ్లపై స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించింది. ఈ సాంగ్ లో రకరకాల గెటప్స్ లో రకరకాల అమ్మయిలు తమ వయ్యారలతో నడుస్తూ, నిల్చుంటే... "చాంఫియన్.." అంటూ పాట సాగుతుంది. అలా సాగే ఈ పాటకు అనుగుణంగా గేల్, బ్రావోలు తమదైన చిందులు వేశారు. ఈ సందర్భంలో తన డాన్స్ టాలెంట్ ను ప్రదర్శించుకోవడానికి కండోమ్ యాడ్ మంచి అవకాశంగా దొరికిందని గేల్ అనడం కొసమెరుపు! సాదారణంగా కండోమ్ యాడ్స్ లో ఎక్కువగా హీరోయిన్స్, ఫిమేల్ మోడల్సే కనిపిస్తుంటారు కానీ.. ఈ సారి వీరిద్దరికీ ఆ అవకాశం వచ్చింది!!
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News