చిలీలో మొదలైన భూకంపం విస్తరిస్తోంది

Update: 2015-09-17 05:21 GMT
దేశ వ్యాప్తంగా వినాయకచవితితో ఆనందోత్సాహాల మధ్య.. పండగ హడావుడిలో బిజీగా ఉంటే.. మరోవైపు మనకు సదూరాన ఉన్న చిలీలో ఈ ఉదయం భారీ భూకంపం చోటు చేసుకుంది.

రిక్టర్ స్కేల్ మీద 8.3తీవ్రతతో నమోదైన భూకంపం కారణంగా చిలీ వణికిపోయింది. తీవ్రత ఎక్కువగా ఉన్న భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. చిలీలో మొదలైన భూకంప ప్రభావం పొరుగుదేశాలకు విస్తరిస్తోంది. రిక్టర్ స్కేల్ మీద 8.3 (మరికొన్న వార్తా సంస్థలు 8.4గా చెబుతున్నాయి) ఉన్న తీవ్రత చిలీనే కాకుండా పక్కనే ఉన్న పెరూ.. హవాయి దేశాల్లోనూ భూకంపం విస్తరిస్తోంది.

తీర ప్రాంతంలో ఉన్న ప్రజల్ని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించటంతో పాటు.. ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నారు. పడవ ప్రయాణాలు.. బోటింగ్ పై పూర్తిస్థాయిలో నిషేధం విధించారు. మరోవైపు..చిలీలో చోటుచేసుకున్న భూకంపం కారణంగా.. ఎంత నష్టం జరిగిందన్నది మాత్రం ఇంకా తెలియ రాలేదు. కడపటి సమాచారం ప్రకారం ఇప్పటివరకూ భూకంపం కారణంగా ఒకరు మరణించారని చెబుతున్నారు.

చిలీ రాజధాని శాంటియాగోకు 230 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. భూప్రకంపనలు భారీగా ఉండటంతో ఇళ్లల్లో నుంచి ప్రజలు బయటకు పరుగులు దీశారు.
Tags:    

Similar News