తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే దాదాపుగా అభ్యర్థుల ఖరారు , నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో అందరూ కూడా విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల పోలింగ్ కి మరికొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో పెద్ద ఎత్తున ప్రజలని ఆకట్టుకోవడానికి రాజకీయ నేతలు వివిధ రకాల ప్లాన్స్ తో ఓటర్ల ముందుకు వస్తున్నారు. ఇదిలా ఉంటే .. ఓటర్లను చైతన్య పరుస్తూ పాటలు పాడుతుంటే .. ఆ ప్రచారంలో సినీ గీతాల్లో ఎంజీఆర్, కమల్‌హాసన్ పాటలపై నిషేధం విధించారు. వారు రాజకీయ నాయకులు కావడంతో వారి పాటలను నిషేధించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే .. చెన్నైలోని కోడంబాక్కంలో ఉన్న అన్నా పార్క్ లో శనివారం సాయంత్రం ఓటర్ల అవగాహన ప్రచారంలో పాట కచ్చేరి నిర్వహించారు. ఈ కచేరీలో పాత, కొత్త సినీగీతాలు ఆలపించిన కళాకారులు, వందశాతం పోలింగ్ నమోదుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో పార్క్ కు వాకింగ్ కు వచ్చిన ఓ వృద్ధుడు కూడా మైక్ అందుకొని ఎంజీఆర్ పాటను ఆలపించాడు. దీన్ని గమనించిన ఎన్నికల అధికారి, ఎంజీఆర్, కమల్‌హాసన్ లు రాజకీయ నేతలుగా ఉన్నారని, వారి పాటలు పాడరాదని తెలియజేస్తూ మైక్ కట్ చేశారు. ఇకపోతే ప్రస్తుతం కమల్ హాసన్ తమిళనాడు ఎన్నికల బరిలో నిల్చున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీకి కూడా మంచి వేవ్ అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఏ విధంగా ఆకట్టుకుంటారో ..