గెలుపు మాత్రమే ముఖ్యం తప్పించి.. మరింకేమీ తమకు పట్టవన్నట్లుగా వ్యవహరించే రాజకీయ పార్టీలు మన దగ్గర ఎక్కువే. ఆర్థిక పరిస్థితి.. ఆర్థిక క్రమశిక్షణ లాంటి వాటిని పట్టించుకోకుండా అధికారాన్ని నిలుపుకోవటం కోసం నోటికి వచ్చినట్లుగా వాగ్దానాలు ఇచ్చేయటం.. ఎన్నికల్లో విజయం సాధించటం కోసం దేనికైనా సిద్ధపడటం లాంటివి మామూలే. ఇలాంటి తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. ఎన్నికల సమయంలో పార్టీలు పాటించాల్సిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో మార్పులు తీసుకురావాలని కమిషన్ భావిస్తోంది.
ఎన్నికల ప్రణాళికలో పార్టీలు ఇచ్చే హామీలు.. వాటికి అయ్యే ఖర్చు విషయంలో నెలకొనే సందిగ్ధతను.. అస్పష్టతలను తొలగించేందుకు వీలుగా చొరవను తీసుకుంది. ఎన్నికల హామీలకు సంబంధించిన అన్ని విషయాలు ప్రజలకు తెలిసేలా ఉండాలన్న లక్ష్యంతో ఎన్నికల ప్రవర్తన నియమావళికి మార్గదర్శకాల్ని సవరించాలని భావిస్తోంది.
దీని కోసం ఒక విధానాన్ని జత చేయాలని ప్రతిపాదన చేసింది. తాజాగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నింటికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక లేఖ రాసింది. ఇందులో ఎన్నికల హామీలు.. వాటి హేతుబద్దత.. వాటి అమలు కోసం నిధుల అందుబాటులో ఉండటం గురించి పార్టీలు.. అభ్యర్థులు వివరణ ఇవ్వాలని ఎన్నికల ప్రవర్తనా నియమావళి చెబుతున్నా.. వాటిని పట్టించుకోకుండా ప్రకనటలు ఇవ్వటం.. హామీల జోరందుకోవటం తెలిసిందే.
ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాల్ని తెలుసుకొని.. వాటి ఆధారంగా అభ్యర్థిని ఎన్నుకోవటానికి అవసరమైన సమాచారాన్ని ఓటర్లకు అందించటం లేదన్న విషయాన్ని వెల్లడించిన ఈసీ.. ఆ తీరుకు చెక్ పెట్టాలని భావిస్తోంది.
న్యాయంగా ఎన్నికల్ని నిర్వహించటం.. అవాంఛనీయ ప్రభావాన్ని కొన్ని వాగ్దానాల్ని చూపిస్తుంటే మౌన ప్రేక్షకుడిలా ఉండిపోకూడదని నిర్ణయించినట్లుగా ఈసీ వెల్లడించింది. తాము చేస్తున్న ప్రతిపాదనల సవరణలపై అభిప్రాయాల్ని తెలియజేయాలని రాజకీయ పార్టీలను కోరింది. ఇందుకు ఈ నెల 18న కటాఫ్ డేట్ గా డిసైడ్ చేసింది.
పార్టీలు ఇచ్చే హామీల్ని అమలు చేయటానికి అవసరమైన నిధుల లభ్యత గురించి ఓటర్లు సమాచారం తెలుసుకోవటానికి వీలుగా ఈసీ తీసుకున్న తాజా నిర్ణయం సాయం చేస్తుందని చెప్పాలి. హామీల అమలు కోసం నిధుల్ని ఏ విధంగా సమరకూర్చుకుంటారు? అదనంగా పన్నులు విధింపు లాంటి చర్యలు తీసుకుంటారా? ఖర్చులను హేతుబద్ధం చేయటం కోసం కొన్ని పథకాల్లో కోత విధిస్తారా? ఎఫ్ఆర్ బీఎం పరిమితులపై వాటి ప్రభావం ఎంత? మరిన్ని అప్పులు చేస్తారా? హామీల అమలుతో లబ్ధి పొందేవారెవరు? హామీల అమలుకు ఎంత ఖర్చు అవుతుంది? లాంటి ప్రశ్నలకు రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి.. ఈ ప్రతిపాదనలకు రాజకీయ పార్టీల రియాక్షన్ ఎలా ఉంటుందో ? చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.