కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. మహారాష్ట్ర విపక్షంగా మారిన.. ఉద్దవ్ నేతృత్వలోని శివసేనను విడిచి పెట్టడం లేదు. శివసేనను తమదేనని ప్రకటించుకున్న సీఎం ఏక్‌నాథ్ షిండే.. ఈ పార్టీ జెండా, గుర్తు తమదేనని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అలా సాధ్యం కాదని.. పేర్కొంటూ.. ఉద్దవ్ సహా శివసేన ఫైర్ బ్రాండ్ ఎంపీ.. సంజయ్‌రౌత్‌లు.. సుప్రీంలో కేసు వేశారు.
ఈ విచారణ ఇంకా ప్రారంభం కాకముందే.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ అధికారులు ఆదివారం పొద్దు పొద్దున్నే దాడులు చేయడం.. సంచలనంగా మారింది. ఇప్పటికే రెండు సార్లు ఈడీ సమన్లు అందుకున్న ఆయన.. గతంలో విచారణకు హాజరుకాలేదు. పాత్రచాల్ భూ కుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో రౌత్‌ను ఈడీ బుక్ చేసినట్టు తెలుస్తోంది. ట్విట్టర్ వేదికగా ఈ దాడులపై స్పందించారు సంజయ్ రౌత్. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులని విమర్శించారు.
అంతేకాదు.. "ఎట్టి పరిస్థితుల్లో శివసేనను వీడేది లేదు. చనిపోయినా సరే.. నేనెవరికీ తలొగ్గబోను. నాకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదు. బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేసి ఈ విషయం చెబుతున్నాను. బాలాసాహెబ్ మాకు ఎలా పోరాడాలో నేర్పారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా" అని రౌత్ ట్వీట్ చేశారు.
ఏమిటీ కేసు?
పాత్రచాల్ కుంభకోణంతో సంజయ్ రౌత్ సతీమణి వర్షా రౌత్ సహా, మరికొంతమంది సన్నిహితులకు సంబంధం ఉందన్నది ఈడీ అధికారుల ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో ఏప్రిల్‌లో వర్షా రౌత్‌కు చెందిన రూ.11.15 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సంజయ్ సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను కూడా జప్తు చేసింది. రూ.1,034 కోట్ల పాత్రచాల్ భూకుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
బీజేపీ ఫైర్..
రౌత్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఏ తప్పూ చేయకపోతే.. ఈడీ విచారణకు రౌత్ ఎందుకు భయపడు తున్నారని ఎమ్మెల్యే రామ్ కడం ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడేందుకు సమయం ఉన్నప్పుడు.. ఈడీ ముందుకు రావడానికి సమయం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.