బ్లాక్ మనీ తీగ లాగితే ఇండియాలోని డొంకలన్నీ కదులుతున్నాయి. ఢిల్లీ టు చెన్నై వయా కోల్ కతా అన్నట్లుగా సాగిన నల్లధనం ప్రయాణ మార్గాలన్నీ బయటపడుతున్నాయి. కోల్ కతాకు చెందిన రియల్టర్ పరాస్ మాల్ లోథాకు ఢిల్లికి చెందిన న్యాయవాది రోహిత్ టాండన్ - చెన్నైకి చెందిన శేఖర్ రెడ్డికి మధ్య అనుబంధం ఇప్పుడు వాణిజ్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు... ఇండియాలో చాలామంది తమ నల్లధనం మార్చుకోవడానికి లోధాపైనే ఆధారపడినట్లుగా సమాచారం.
ఢిల్లీ - చెన్నైల్లో పట్టుబడిన నల్లధనమంతా కోల్ కతా వ్యాపారి వైట్ చేయడానికి ట్రై చేసిందేనని తెలుస్తోంది. ఢిల్లి - చెన్నైలలో అధికారులు రూ.148 కోట్ల స్వాధీనం చేసుకోగా, ఆ మొత్తంతో లోథాకు ప్రమేయం ఉన్నట్లుగా తేలింది. తన కుమార్తె వివాహం వైభవం గా చేసిన నేపథ్యంలో గతంలోనే ఆయన ఐటీ అధికారుల దృష్టిలో పడ్డారు. ఈ పెళ్ళికి పలువురు ఉన్నతాధికారులు - నాయకులు - సినీ ప్రముఖులు హాజరయ్యారు. వ్యాపారవేత్త శేఖర్ రెడ్డి - టి అండ్ టి లా ఫర్మ్ యజమాని రోహిత్ టాండన్ లు భారీ మొత్తాల్లో తమ పాత నోట్లను ఈయన ద్వారానే కొత్తనోట్లలోకి మార్పించుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. రోహిత్ టాండన్ కార్యాలయంపై దాడుల అనంతరం లోథా పై ఐటీ అధికారుల దృష్టి పడింది. ఆ కార్యాలయం నుంచి అధికారులు రూ.13.62 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.2.62 కోట్ల మేరకు రూ.2,000 కొత్త నోట్లు ఉన్నాయి.
దేశంలో చాలావరకు బడాబాబుల నోట్ల మార్పిడి వ్యవహారాలన్నీ లోథాయే చూసినట్లు అనుమానిస్తున్నారు. డిజిటల్ డైరీ పరిశీలించిన ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు వారు దిగ్భ్రాంతి చెందేలా ఎన్నో నిజాలు తెలిసివచ్చాయి. పలువురు ప్రముఖ రాజకీయ నాయకులతో ఆయనకు సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఆయన వాట్సప్ చాట్ లను పరిశీలిస్తే, 20-25 శాతం కమిషన్ కు ఆయన పాతనోట్లను మార్చే పనులు చేస్తానని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టాండన్ - శేఖర్ రెడ్డిలకు చెందిన రూ. 25 కోట్లను ఆయన 15-20 శాతం కమీషన్ కు మార్చారట.
ఢిల్లీలో టాండన్ కార్యాలయంలో దొరికిన భారీ నగదుపై ఆయనను ప్రశ్నిస్తున్న సమయంలో చెన్నైకి చెందిన మైనింగ్ టైకూన్ జె. శేఖర్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఆయన ఇంటి నుంచి అధికారులు రూ.135 కోట్ల మేరకు లెక్కలోకి రాని నగదుతో పాటుగా 177 కిలోల బంగారం కడ్డీలు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ దొరికిన నగదులో రూ.10 కోట్ల మేరకు కొత్త కరెన్సీ ఉండడం గమనార్హం. శేఖర్ రెడ్డి ఉదంతంలోనే తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండిన పి.రాంమోహన్ రావు నల్లధనం బాగోతం కూడా బయటపడింది. అది మరో పెద్ద కథగా మారింది. మొత్తానికి ఈ లింకులన్నీ లోధాతోనే ముడిపడి ఉన్నాయని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/