ఢిల్లీ లిక్క‌ర్ స్కాం.. మ‌లుపులు సీబీఐ అయిపోయింది.. రంగంలోకి ఈడీ!

Update: 2022-09-08 01:30 GMT
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిన్న  మొన్న‌టి వ‌ర‌కు సీబీఐ అధికారులు దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఢిల్లీ సీ ఎం కేజ్రీవాల్ మంత్రివ‌ర్గంలోఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న సిసోడియా నివాసాల్లో త‌నిఖీ చేశారు. ఆయ‌న‌కు నోటీసులు కూడా ఇచ్చారు. ఇక‌, ఈ ఘ‌ట‌న‌లోఇప్పుడు మ‌రో మ‌లుపు తెర‌మీదికి వ‌చ్చింది. ఢిల్లీ లిక్క‌ర్ కేసులో.. ఈడీ అధికారులు వేలు పెట్టారు. దీనికి సంబంధించిన లోగుట్టుపై ఈడీ అధికారులు ఆధారాలను సేకరిస్తున్నారు.

మద్యం పాలసీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా.. ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈడీ అధికారు లు  హైదరాబాద్లోని 5 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.గ‌త 24 గంట‌లుగా ఈ సోదాలు సాగుతూనే ఉన్నాయి.  

రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ పటేల్ రోడ్డులోని నవకేతన్ భవన్లో రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ చిరునామా ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

అక్కడికి వెళ్లి తనిఖీ చేసిన ఈడీ అధికారులకు సదరు చిరునామాలో ఓ పేరొందిన బ్యూటీ పార్లర్ ఉన్నట్లు తేలింది. రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్లో డైరెక్టర్గా ఉన్న అభిషేక్ రావు సదరు బ్యూటీ పార్లర్ సంస్థలకు డైరెక్టర్గా ఉన్నారు. హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కు తప్పుడు చిరునామా ఇచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.

రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ ఈమెయిల్ అడ్రస్ సైతం ఒకటేనని ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. కోకాపేట్లోని రాంచంద్ర పిళ్లై నివాసంలోనూ ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పలువురి రాజకీయ ప్రముఖులతో రాంచంద్ర పిళ్లైకి సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు తగిన ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే.. చివ‌ర‌కు ఏంతేలుస్తారు?  నిజంగానే అక్ర‌మాలు జ‌రిగాయ‌ని తేలుస్తారా?  లేక రాజ‌కీయ జోక్యం పెరుగుతుందా? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి చూడాలి ఏం జ‌రుగుతుందో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News