వందేళ్ల రికార్డు సగటుతో కురిసిన వర్షంతో చెన్నై మహానగరం ఎంతలా అతలాకుతలం అయ్యిందో తెలిసిందే. ఇలాంటి భారీ వర్షాలకు కారణంగా ఎల్ నినో అని తేల్చింది ఐక్యరాజ్యసమితి. దీని ప్రభావంతోనే దక్షిణ భారత దేశంలో భారీ వర్షాలు కురిసినట్లుగా తేల్చింది. అంతేకాదు.. రానున్న రోజుల్లో చెన్నై ఘటనలు రిపీట్ ఖాయమని హెచ్చరించటం గమనార్హం. భారీ వర్షాలు.. దక్షిణ భారత దేశంలో ఖాయమన్న అంచనాను వ్యక్తం చేసింది.
ఒక్క దక్షిణ భారతంలోనే కాదు.. ఇండోనేషియా.. కొలంబియా.. ఫిలిప్పీన్.. థాయ్ లాండ్ పై ఎల్ నినో ప్రబావం భారీగా ఉందని.. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో వర్షాలు.. వరదలు ఖాయమని హెచ్చరిస్తోంది. భారీ వర్షాలు.. వరదల జాబితాలో శ్రీలంక దేశం ఉంటుందన్న అంచనాను ఐక్యరాజ్యసమితి వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ సంస్థ వార్నింగ్ నేపథ్యంలో.. భవిష్యత్తులో చోటు చేసుకునే విపత్తులకు తగినట్లుగా కార్యాచరణను యుద్ద ప్రాతిపదికన షురూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.