ఏపీలో ఎన్నిక‌ల బ‌డ్జెట్‌.. కేటాయింపులన్నీ వాటికేనా?!

Update: 2023-01-14 02:30 GMT
ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం మ‌రో  50 రోజుల్లో ముగియ‌నుంది. ఏప్రిల్ 1 నుంచి నూత‌న 2023-24 బ‌డ్జెట్ తెర మీదికి రానుంది. అయితే.. ఈ బ‌డ్జెట్‌లో అయినా.. ప్రాధాన్య రంగాల‌కు చోటు క‌ల్పిస్తారా? అనేది ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయ‌లేదు.

ముఖ్యంగా పోల‌వ‌రానికి కేంద్రం నిధులు ఇవ్వ‌క‌పోయినా.. సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల నాటికి పూర్తి చేసి నీళ్లుపారిస్తార‌ని.. గ‌తంలో మంత్రి అనిల్ కుమార్ ప్ర‌క‌టించారు.

ఇదే విష‌యాన్ని ప్ర‌స్తుత మంత్రి రాంబాబు కూడా చెబుతున్నారు. ఇక‌, విద్య‌కు, ముఖ్యంగా వైద్య క‌ళాశాల ల‌కు కేంద్రం ఇవ్వ‌క‌పోయినా తామే నిధులు ఇస్తామ‌ని చెప్పారు. వెనుక‌బ‌డిన జిల్లాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ర‌హ‌దారుల స‌మ‌స్య అలానే ఉండిపోయింది. తాగు నీటి సౌకర్యం.. విద్యుత్ వంటివి ఎదురు చూస్తున్నాయి. ప్ర‌భుత్వం ఇవ్వాల్సిన బ‌కాయిలు ఇస్తే.. చాలు మేం ప్ర‌జ‌ల‌ను పీడించ‌బోం అని విద్యుత్ శాఖ బ‌హిరంగంగానే చెప్పింది.

సో.. ఇవ‌న్నీ కూడా.. బ‌డ్జెట్ ముందు ప్ర‌భుత్వానికి నివేదిక‌ల రూపంలో అందాయి. మ‌రోవైపు కీల‌క‌మైన జల వనరుల శాఖకు 2022-23(ప్ర‌స్తుత బ‌డ్జెట్‌)లో రూ.13,500 కోట్లు కేటాయించారు. కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదు. ఆ నిధులు విడుదల చేయాలని అధికారులు కోరుతున్నారు. కాంట్రాక్టర్లకు రూ.8 వేల కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉందని.. ఇంకో రూ.4,500 కోట్లు ఎత్తిపోతల పథకాల విద్యుత్‌కు బిల్లులు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో వ‌చ్చే 2023-24 బ‌డ్జెట్‌లో వీటికి మోక్షం క‌ల్పిస్తార‌ని అంద‌రూ భావిస్తున్నారు. కానీ, ఏపీ ప్ర‌భు త్వం ఆదిశ‌గా అడుగులు వేస్తున్న ప‌రిస్థితి అయితే క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. ప్ర‌స్తుతం పెట్టే బ‌డ్జెట్ ఎన్నిక‌ల బ‌డ్జెట్!  వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు వున్నాయి.

సో.. ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను మెప్పించేందుకు అవ‌స‌ర‌మైతే.. మ‌రిన్ని ఆక‌ర్ష‌ణీయ ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో సంక్షేమానికే పెద్ద పీట వేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఖ‌చ్చితంగా ఈ బ‌డ్జెట్‌లోనూ వాటికే కేటాయింపులు పెరుగుతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News