ఇటీవల వివాదాస్పద ప్రసంగం చేసిన ఎంపీ సాక్షీ మహారాజ్‌ను ఇవాళ ఎన్నికల సంఘం మందలించింది. మరోసారి అలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరించింది. క్రమశిక్షణా ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది. జనవరి 6న మీరట్‌లో జరిగిన సభలో బీజేపీ ఎంపీ సాక్షీ మహారాజ్ ఓ వర్గంపై అసందర్భ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆ ప్రసంగంపై వివరణ ఇవ్వాలని ఎంపీ సాక్షీ మహారాజ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.
ఈసీ ఇచ్చిన నోటీసుకు సాక్షీ మహారాజ్ రిప్లై ఇస్తూ... తాను ఎటువంటి ఎన్నికల సభలో మాట్లాడలేదని, కేవలం సాధువుల సమావేశంలో తాను ఆ అభిప్రాయాన్ని వినిపించినట్లు సాక్షీ మహారాజ్ చెప్పారు. అయితే ఎంపీ సమాధానంతో సంతృప్తి చెందని ఎన్నికల సంఘం ఆయన్ను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. నలుగురు భార్యలు, 40 మంది పిల్లలు ఉండడం వల్లే జనాభా విపరీతంగా పెరుగుతున్నట్లు మీరట్ సమావేశంలో ఎంపీ సాక్షీ మహారాజ్ వ్యాఖ్యానించిన సంగత తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/