సమరానికి.....సిద్దం

Update: 2018-09-10 07:46 GMT
ముందస్తు ఎన్నికల జోరు అందుకుంది.......వేగం పుంజుకుంది.....శర వేగంతో ముందుకు సాగిపోతోంది. ఎన్నికలు నవంబరులోఉంటాయని తెలంగాణ రాష్ట్ర అపధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పకనే చెప్పారు. దీంతో ఎలక్షన్ కమీషన్ రాష్ట్రంలో  ఎన్నికల నిర్వాహణకు చకచక పనులు చేపడుతోంది. రాబోయే రెండు లేక మూడు రోజులలో ఎలక్షన్ కమీషన్ ఉన్నత స్దాయి సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.  తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వాహణకు దాదాపు 300 కోట్లు ఖర్చు అవుతుందని ఎలక్షన్ కమీషన్ అంచనాకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి 92,800 ఈవీఎంలు - 44,000 వీవీపీఏటీలు కేటాయించామని ఎలక్షన్ కమీషన్‌కు చెందిన అధికారులు చెప్పారు. వీటిని సెప్టెంబరు మూడవ వారంలోగా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు చేరవేస్తామని ఎన్నికల అధికారులు చెప్పారు.

తెలంగాణ ఎన్నికల కమీషన్ ఈ సంవత్సరం మార్చి నెలలో ఓటర్ల జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర జనాభా లో  70 శాతం మందికి మాత్రమే ఓటు హక్కు ఉందని ఎలక్షన్ కమీషన్ తన నివేదిక ద్వారా తెలిపింది. మొత్తం రాష్ట్ర జనాభా లో  పురష ఓటర్లే ఎక్కువగా ఉన్నట్లు నివేదికలో తెలిపింది. తెలంగాణలో ఓటర్ల సంఖ్య గతంతో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గినట్లు ఎన్నికల కమీషన్ గుర్తించింది. హైదరాబాద్ నగరంలో కొన్ని నియోజక వర్గాలలో ఈ తగ్గుదల భారీగా కనిపిస్తోంది. అయితే అత్యధిక ఓటర్లు  శేర్లింగం పల్లిలో ఉన్నాయి. అలాగే అత్యల్ప ఓట్లు భద్రచలంలో నమోదయ్యాయి. అర్హులైన అభ్యర్దులందరూ కూడా తమ ఓటును నమోదు చేసుకోవాలని ఎలక్షన్ కమీషన్ సూచించింది. అలగే అర్హులైన అభ్యర్దులకు ఓటు హక్కు కల్పించేందుకు తమ నియోజక వర్గాలలోని రాజకీయ నేతలు ముందుకు వస్తున్నారు. దీంతో తమ నియోజక వర్గంలో ఓట్లు పెరిగితే అది తమకు కలసి వస్తుందని వారు భావిస్తున్నారు. కాగా ఇప్పటికే ఓటర్లుందరికీ గుర్తంపు కార్డులు జారీ చేయటం మొదలు పెట్టామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News