ఆ భారీ మ‌హిళ అస్స‌లు లావు త‌గ్గ‌లేద‌ట‌

Update: 2017-04-25 06:04 GMT
వంద‌.. నూట‌యాభై కిలోల మ‌నుషుల్ని మ‌నం చూసేదే. కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో 200 కిలోలున్న మ‌నుషుల్ని చూస్తుంటాం. కానీ.. ఏకంగా 500 కేజీల బ‌రువున్న మ‌నిషిని చూసింది లేదు. ఇంత భారీ బ‌రువు
(ప్ర‌పంచంలోనే అత్యంత బ‌రువైన మ‌హిళగా పేరున్న‌) తో ఉన్న ఒక ఈజిఫ్టు మ‌హిళ‌.. క‌ద‌ల్లేని ప‌రిస్థితుల్లో.. త‌న బ‌రువును స‌గానికి సగం త‌గ్గించుకోవ‌టం ముంబ‌యికి రావ‌టం తెలిసిందే. ఈమె కేసును ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకొని.. ఆమె బ‌రువును స‌గానికి కంటే ఎక్కువ‌గా త‌గ్గించే బాధ్య‌త‌ను నెత్తిన వేసుకున్న సైఫీ ఆసుప‌త్రికి చెందిన డాక్ట‌ర్ మ‌ఫ‌జ‌ల్ ల‌క్డావాలా తాజాగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు.

త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన భారీ మ‌హిళ‌కు చికిత్స ప్రారంభించిన కొద్దికాలంలోనే.. త‌మ చికిత్స ఫ‌లిస్తోంద‌ని.. ప్ర‌స్తుతం ఆమె బ‌రువు స‌గానికి త‌గ్గిందంటూ ఈ మ‌ధ్య‌నే డాక్ట‌ర్ ల‌క్డావాలా చెప్ప‌టం తెలిసిందే. కేవ‌లం వారాల వ్య‌వ‌ధిలో దాదాపు 200 కేజీలకు పైగా బ‌రువును త‌గ్గించిన వైనం అంద‌రి దృష్టిని ఆకర్షించింది. త్వ‌ర‌లో ఆమె బ‌రువును మ‌రింత త‌గ్గిస్తామ‌ని చెప్పారు కూడా.

ఇదిలా ఉంటే.. ఈ ఉదంతం ఇప్పుడు విచిత్ర‌మైన మ‌లుపు తిరిగింది. వైద్యులు చెప్పిన‌ట్లుగా త‌న సోద‌రి బ‌రువును వైద్యులు ఏ మాత్రం త‌గ్గించ‌లేద‌ని చెబుతోంది భారీ మ‌హిళ సోద‌రి. త‌న సోద‌రికి చికిత్స చేస్తున్న డాక్ట‌ర్ ల‌క్డావాలా అబ‌ద్ధాల కోరు అని.. త‌న అక్క ప‌రిస్థితి ఏ మాత్రం మెరుగుప‌డ‌లేద‌ని ఆమె చెబుతోంది. దీనిపై డాక్ట‌ర్ స్పందిస్తూ.. త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్ని ఖండిస్తున్నారు. ఇమాన్ (లావుపాటి మ‌హిళ‌) ఆరోగ్యం బాగుంద‌ని.. ఆమె న‌రాల అంచ‌నాకు ఒక సిటీ స్కాన్ అవ‌స‌రం ఉంద‌ని.. ఆర్థిక కార‌ణాల వ‌ల్ల త‌న అక్క‌ను త‌రిగి ఈజిఫ్టుకు తీసుకు వెళ్లాల‌ని రోగి సోద‌రి కోరుకుంటుంద‌ని.. అందులో భాగంగా త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లుగా డాక్ట‌ర్ ల‌క్డావాలా చెబుతున్నారు.

త‌మ వ‌ద్ద‌కు తీసుకొచ్చిన 15 రోజులు బాగానే ఉంద‌ని.. త‌న అక్క కోలుకుంద‌ని.. ఇక ఈజిఫ్టుకు తీసుకెళ్ల‌వ‌చ్చ‌ని చెప్పిన‌ప్ప‌టి నుంచి ఏదో ర‌కంగా గొడ‌వ చేస్తోంద‌ని.. సిటీస్కాన్ కోసం ఇమాన్‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చే స‌మ‌యంలో.. ఆమె ఎంత త‌గ్గింది అంద‌రికి తెలిసే అవ‌కాశం ఉంద‌ని డాక్ట‌ర్ చెబుతున్నారు. అంత‌వ‌ర‌కూ ఆగే బ‌దులు.. తాజాగా ఆమె బ‌రువును తెలిపే ఆధారాల్ని బ‌య‌ట పెడితే స‌రిపోయేది క‌దా? అన్న సందేహాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News