ఉద్యోగులు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. వారి ఇంట్లో, ఆఫీసులో వాతావరణం సఖ్యంగా ఉంటేనే వారు రాణించగలరు. ఆఫీసులోనే ఒకటే టెన్షన్ పెట్టేవారు ఉండకూడదు.. అలా ఉంటే సరిగ్గా పనిచేయలేరు. ప్రస్తుతం ఉద్యోగులను మానసిక ఒత్తిడి చిత్తు చేస్తోందని నివేదికలో తేలింది.
మానసిక సమస్యలు ఉద్యోగులను తీవ్రంగా వేధిస్తున్నాయని.. పెద్ద భారాన్నే మోపుతున్నాయని తేలింది. ఏ స్థాయిలో అంటే 14 బిలియన్ డాలర్ల మేర (దాదాపు 1.2 లక్షల కోట్లు) కంపెనీలకు నష్టాలను తెచ్చిపెడుతున్నాయని తేలింది. డెలాయిట్ తూచ్ తోమత్సు ఇండియా ఇందుకు సంబంధించిన సంచలన నివేదిక విడుదల చేసింది. అదిప్పుడు చర్చనీయాంశమైంది.
మానసిక ఆరోగ్యం కారణంగా విధులకు గైర్హాజరు కావడం.. తక్కువ ఉత్పాదకత, వలసలు కలిసి కంపెనీలు ఈ స్థాయిలో నష్టపోతున్నాయని నివేదిక తేల్చింది. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ఉద్యోగుల్లో మానసిక అనారోగ్య సమస్యలు పెరుగుతూ పోతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మానసిక అనారోగ్యం వల్ల పడే భారంలో భారత్ వాటా 15శాతంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) గణాంకాలు చెబుతున్నాయి.
భారత ఉద్యోగుల్లో మానసిక ఆరోగ్యం ఎలా ఉంది? సంస్థలపై దాని ప్రభావం ఏమేరకు అనే విషయాలను తెలుసుకునేందుకు డెలాయిట్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది.పనిలో ఉండే ఒత్తిళ్లు తమ మానసిక ఆరోగ్యానికి దెబ్బతీస్తున్నట్టు 47 శాతం మంది నిపుణులు చెప్పారు.
ఆ తర్వాత ఆర్థిక సమస్యలు, కరోనా మహమ్మారిని వారు కారణాలుగా పేర్కొన్నారు. ఈ ఒత్తిళ్లు అన్నవి వ్యక్తిగతంగా , వృత్తిపరంగా సామాజికపరంగానూ ఉద్యోగులపై ప్రభావం చూపిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగులు పనికి వచ్చినా వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల కారణంగా ఉత్పాదకత తక్కువే ఉంటున్న విషయాన్ని ఈ నివేదిక ఎత్తి చూపింది.
గడిచిన ఏడాది కాలంలో 80 శాతం ఉద్యోగులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. గణాంకాలు భయపెట్టే విధంగా ఉన్నా.. 39 శాతం మంది సామాజిక నిందల భయంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది
పని ప్రదేశంలో మానసిక అనారోగ్యం ఉన్నప్పటికీ 33 శాతం మంది తాము ఎప్పటి మాదిరిగానే విధులకు హాజరవుతున్నామని చెప్పారు. ఇక 20 శాతం మంది రాజీనామా చేసి ఒత్తిడి తక్కువగా ఉండే మెరుగైన ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నట్టు డెలాయిట్ సర్వేలో వెల్లడించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.