శృంగార సామర్థమెంత.? స్మార్ట్ ఫోన్ తో టెస్ట్

Update: 2019-07-30 01:30 GMT
పెళ్లి అయ్యి పిల్లలు లేని వాళ్లు ఎందరో ఉంటారు. వారు పిల్లల కోసం ఎంతో ఆరాటపడుతుంటారు. వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటారు. సంతానానికి కారణాలు తెలుసుకుంటారు.  ముఖ్యంగా పిల్లలు పుట్టకపోవడానికి వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండడమే కారణంగా చాలా పరీక్షల్లో తేలుతోంది. అధికమైన పని ఒత్తిడి- కంప్యూటర్ ఉద్యోగాల వల్ల శృంగార సామర్థ్యం తగ్గడం.. వీర్యకణాల సంఖ్య కూడా తగ్గుతోందని పరిశోధనల్లో తేలింది.

అయితే ఇప్పుడు అమెరికాలోని చికాగో ఇల్లినాయిస్ యూనివర్సిటీ పరిశోధకులు ఇంట్లోనే శృంగార సామర్థ్య పరీక్ష స్మార్ట్ ఫోన్ తో చేసుకునేలా తయారు చేశారు. ‘ఐఫోన్ మైక్రో స్కోప్’గా నామకరణం చేశారు. స్మార్ట్ ఫోన్లను మైక్రో స్కోప్ లుగా మార్చే ప్రత్యేక లెన్స్ లను రూపొందించారు. ఈ లెన్స్ లను స్మార్ట్ ఫోన్ కు అనుసంధానించి కెమెరాకు కలుపుతారు. వీడియో ద్వారా వీర్యకణాల సంఖ్యను పరీక్షిస్తారు.

స్మార్ట్ పోన్ కు ఆప్టికల్ కేబుల్ అనుసంధానిస్తారు. ఈ అనలైజర్ వీర్యాన్నిక్షుణ్ణంగా పరిశీలించి వీర్య కణాల నాణ్యతను తేలుస్తుంది. ఈ మైక్రోచిప్ వీర్యనమూనాని పరీక్షించి ఆప్టికల్ కేబుల్ ద్వారా స్మార్ ఫోన్ కు సమాచారం చేరవేస్తుందని తేల్చారు. ఇందుకోసం ఓ యాప్ ను తీర్చిదిద్ది అనుసంధానించారు. కేవలం నిమిషంలో దీనికి సంబంధించిన రిపోర్ట్ మనకు క్షణాల్లోనే తెలిసిపోతుందని  చెబుతున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ తో 98శాతం ఫలితాలు ఖచ్చితత్వంగా వస్తాయట.. ఇప్పుడు వీర్యకణాల సంఖ్యను తేల్చే యాప్ వినియోగదారులకు వరంగా మారనుంది.


    

Tags:    

Similar News