తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. తన కాన్వాయ్ లోని వాహనం బోల్తా పడటం.. ఆ ఘటనలో ఇద్దరు మరణించిన వైనం సంచలనంగా మారింది. ప్రమాదం జరిగిన తర్వాత తానే దగ్గరుండి అన్ని చూసుకోవటంతో పాటు.. ఆసుపత్రిలోనూ ఉన్న మంత్రి ఎర్రబెల్లి.. తన సిబ్బంది ఇద్దరు మరణించటాన్ని తట్టుకోలేకపోయారు.
కంటతడి పెట్టటంతో పాటు.. మరణించిన కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జనగామ జిల్లా చీటూరు వద్ద శనివారం అర్థరాత్రి వేళ ఎర్రబెల్లి కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం బోల్తా పడటం.. వాహనాన్ని నడిపిన డ్రైవర్ పార్థసారధి.. సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ పూర్ణేందర్ లు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మరణించిన వారి అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. అంతిమయాత్ర సందర్భంగా డ్రైవర్ పాడెను మోసి.. సిబ్బందిపై తనకున్న ప్రేమాభిమానాల్ని చాటారు. బాధితుల కుటుంబ సభ్యులతో పాటు మంత్రి కూడా కన్నీటి పర్యంతమయ్యారు.