మెదక్ జిల్లాలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా చేసినట్టు ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక ఇచ్చింది. మొత్తం 6 పేజీల నివేదికను మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ తాజాగా రూపొందించి సీఎస్ సోమేశ్ కుమార్ కు అందజేసినట్టు సమాచారం.
ఈటల రాజేందర్ తన కోళ్ల ఫాంల కోసం 66 ఎకరాల భూమి కబ్జా చేసినట్టు విచారణ కమిటీ తేల్చింది. రోడ్ వైడెనింగ్ లో భాగంగా చాలా చెట్లను నరికి వేసినట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీనిపై కూడా సీఎస్ కు కలెక్టర్ హరీష్ నివేదికను సమర్పించారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట భూములను మంత్రి ఈటల రాజేందర్ కబ్జా చేశారని అక్కడి రైతులు సీఎం కేసీఆరు్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసీఆర్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
తాజాగా కమిటీ చేపట్టిన విచారణలో మంత్రి ఈటల పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు నిజమేనని తేలింది. ఇప్పటికే మంత్రి ఈటల శాఖను సీఎం కేసీఆర్ తీసుకున్నారు. ఈటల శాఖను తొలగిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు.