తనను కేసీఆర్ కేబినెట్ నుంచి తప్పిస్తారనే వార్తల నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ ఒకింత సంచలన వ్యాఖ్యలు చేశారు. తను ఎవరి దయతోనో, మరెవరికి భిక్ష గానో మంత్రిగా కొనసాగడం లేదని.. తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండా ఓనర్లలో తనూ ఒకరని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తనను మంత్రి పదవి నుంచి తప్పించడం ఎవరికీ అంత సులువు కాదన్నట్టుగా ఈటల రాజేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
తన కుల ప్రాతిపదికనో మరో రకంగానో మంత్రి పదవిని ఎప్పుడూ కోరలేదని కూడా ఈటల వ్యాఖ్యానించారు. తను తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసినట్టుగా ఈటల చెప్పారు. తనను చంపాలని చూసినప్పుడు కూడా తెలంగాణ జెండా పట్టుకుని ముందుకు వెళ్లినట్టుగా చెప్పుకొచ్చారు. తను తెలంగాణ రాష్ట్ర సమితిలోకి మధ్యలో రాలేదని తను గులాబీ జెండా ఓనర్లలో ఒకరని ఈటల అన్నారు.
అధికారం శాశ్వతం కాదని, న్యాయం, ధర్మాలు ముఖ్యమని.. తను ఏనాడైనా కనీసం ఐదు వేల రూపాయల లంచం తీసుకున్న వాడిని కాదన్నారు. తనను కేబినెట్ నుంచి తప్పిస్తారనేది కేవలం చిల్లర ప్రచారం అని ఈటల వ్యాఖ్యానించారు.
మొత్తానికి తన విషయంలో వచ్చిన ప్రచారం పై ఈటల రాజేందర్ చాలా ఘాటుగా స్పందించారు. ఎవరి పేర్లూ ఎత్తకుండానే తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన మీద తప్పుడు ప్రచారాలు మానుకొమ్మన్నట్టుగా చెప్పడంతో పాటు, నిజంగానే కేసీఆర్ కు ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించే ఆలోచన ఉన్నా..ఆయనకు కూడా ఈటల రియాక్షన్ ఘాటుగా తగిలేట్టుగా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.