హుజూరాబాద్ ఉప ఎన్నికలో కీలకమైన పోలింగ్ కు సమయం దగ్గరకు వచ్చేస్తోంది. దీంతో ఇరు పార్టీల మధ్య ప్రచార హోరు జోరుగా సాగుతోంది. ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున చేసుకుంటున్న విమర్శలు.. ఆరోపణలు ఇప్పుడు చర్చగా మారుతోంది. ఎదురుదాడితో ఈటలను దెబ్బ తీయాలని టీఆర్ఎస్ భావిస్తుంటే.. అందుకు భిన్నంగా ఆవేదన అన్న సెంటిమెంట్ అస్త్రంతో గులాబీ అధినేతను ఎదుర్కోవాలని ఈటల భావిస్తున్నారు. పోటాపోటీగా సాగుతున్న ప్రచారపు వేళ.. రోజుకో రీతిలో తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న ఈటల మాటలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.
ఇంతకాలం ప్రత్యర్థి పార్టీల గుట్లను రట్టు చేసిన టీఆర్ఎస్ కు.. ఈటల రూపంలో ఇంటి గట్టు రచ్చ రచ్చగా మారుతోంది. తాజాగా ఆయన హుజూరాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల.. తాను సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని.. ప్రభుత్వ సొమ్ము పేదలకు మాత్రమే చెందాలని చెప్పానని చెప్పారు. రైతుబంధు పథకం డబ్బులున్న వారికి ఇవ్వొద్దని.. కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పటం తప్పా? అది ధిక్కారం అవుతుందా? అని ప్రశ్నించారు.
తనకు అవకాశాలు ఇచ్చారని.. నా జీతం కూడా ఈటల రాజేందరర్ ఇస్తారన్న వారు.. ఇప్పుడెందుకు గొంతు నులిమారు? ఎర్రబెల్లి.. మల్లారెడ్డి.. సబితల మాదిరి మధ్యలో వచ్చినోడ్ని కాదు. సొంత పార్టీ నేతల్ని కొన్న నీచపు పార్టీ టీఆర్ఎస్. నన్నుపొమ్మనలేక పొగబెట్టారు. వెన్నుపోటు పొడిచారు. 18 ఏళ్లు ఉద్యమంలో వాడుకొని తెలంగాణ వచ్చిన తర్వాత బయటకు పంపారు అంటూ తన ఆవేదనను ఆకట్టుకునేలా చెప్పుకున్నారు. పదవుల కోసం పెదవులు మూయొద్దని.. గులాబీ జెండాకు ఓనర్లమని చెప్పినప్పటి నుంచి కేసీఆర్ తనను రాసి రంపాన పెట్టాడన్నారు.
కేసీఆర్ వారసత్వం ఎప్పుడు వస్తుందన్న ఆశతో అవమానాలు భరిస్తూ హరీశ్ రావు అక్కడే ఉంటున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికలు చిన్నవని మంత్రి కేటీఆర్ అంటున్నారని.. అలాంటప్పుడు రూ.350 కోట్ల ఖర్చు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. మొత్తంగా తన ఆవేదనను అనేక రకాలుగా చెబుతూప్రజల్ని ఆకట్టుకుంటూ వస్తున్న ఈటలకు.. ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే తీర్పు ఏమిటన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.