నాలుగు దినాల్లో నాలుగు పెళ్లిళ్లు చేసుకొని...

Update: 2015-01-20 08:55 GMT
భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో వాక్‌ స్వాతంత్య్రపు హక్కు ఒకటి! దేవుడు నోరిచ్చాడు కదా అనీ, రాజ్యాంగం మాట్లాడే హక్కు ఇచ్చింది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడి, ఐకమత్యానికి పెట్టింది పేరైన భారతదేశంలో కొత్త సమస్యలను కొనితెస్తోన్నారు పెద్దమనుష్యులుగా చెలామణీ అయ్యే కొందరు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త ఎక్కువగా మీడియాలో కనిపిస్తోన్న విహెచ్‌పి నేత ప్రవీణ్‌ తొగాడియా రోజురోజుకూ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోన్నారు! భారతదేశంలో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు మొదలైన మతాల వారు ఉన్నంతలో కలిసి ఐకమత్యంగానే ఉంటున్నారనేది జగమెరిగిన సత్యం! కొన్ని చోట్ల దీనికి కాస్త భిన్నమైన వాతావరణం ఉన్నప్పటికీ... అది తీవ్ర స్థాయిలో లేదేమోనని పలువురి అభిప్రాయం! ఈ కాస్త సమస్యకు కూడా స్వార్థపూరిత రాజకీయనాయకులే కారణం అన్నది అందరికీ తెలిసిన విషయమే! ఇప్పుడు ఈ పనిని తమ భుజాలపై వేసుకుని దేశమంతా పర్యటించేస్తోన్నారు ప్రవీణ్‌ తొగాడియా!

దేశ సమైక్యతకు భంగం వాటిల్లేలా మాట్లాడటమే పనిగా పెట్టుకుని దేశపర్యటన చేస్తోన్న ప్రవీణ్‌ తొగాడియా  తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు! లవ్‌జీహాద్‌ను సహించబోమని హెచ్చరించిన ఆయన తలాక్‌ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు! నాలుగు దినాల్లో నాలుగు పెళ్లిళ్లు చేసుకొని, మూడు గంటల్లో ముగ్గురికి తలాక్‌ ఇచ్చే విధానాన్ని ప్రేమ అంటారా అని ప్రశ్నిస్తోన్నారు! ఈ వ్యాఖ్యలతో ముస్లిం మత పెద్దలు గరం గరం గా ఉన్నారని సమాచారం! మన గొప్ప తనాన్ని చెప్పుకోవడానికి మాత్రమే హక్కు ఉంది కానీ... ఇతరుల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయడానికో, ఇతర మతస్థులను, వారి సిద్దాంతాలను అవమానించడానికో మనకు హక్కు లేదనే కనీస విషయాన్ని ప్రవీణ్‌ తొగాడియా మరిచిపోయారని పలువురు అభిప్రాయపడుతున్నారు! ఈ విషయంలో బీజేపీ నేతలు కాస్తంత హుందాగా వ్యవహరించి ఇటువంటి వాఖ్యలు చేసేవారిని అదుపుచేయాలని, అలా కాని పక్షంలో ఇది తిరిగి తిరిగి బీజేపీ మెడకే చుట్టుకునే అవకాశాలు పుష్కలం అని విశ్లేషకుల అభిప్రాయం!
Tags:    

Similar News