అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా విడుదల అయ్యి 50 రోజులు దాటి పోయింది. అయినా కూడా సోషల్ మీడియాలో ఆ సినిమా తాలూకు హడావుడి తగ్గలేదు. పైపెచ్చు గత రెండు వారాలుగా పుష్ప ఫీవర్ పీక్స్ కు చేరింది. సోషల్ మీడియాలో పుష్ప సినిమాకు సంబంధించిన షార్ట్ వీడియోలు లక్షల కొద్ది షేర్ అవుతున్నాయి. శ్రీవల్లి డాన్స్ స్టెప్పును అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లారు. వివిధ దేశాల క్రికెటర్లు ఇంకా అనేక మంది క్రీడాకారులు శ్రీవల్లి స్టెప్ వేసి పుష్ప సినిమా కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చి పెట్టారు. డాన్స్ స్టెప్ అంటే ఏమో కాని తగ్గేదే లే డైలాగ్ కూడా అంతే పాపులారిటీని దక్కించుకుంది.
తగ్గేదే లే డైలాగ్ ను తెలుగు లో జనాలు ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో.. అదే స్థాయిలో హిందీ లో ఆ డైలాగ్ ను వినియోగిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే తెలుగు డైలాగ్ కంటే హిందీ డైలాగ్ కు ఎక్కువ షార్ట్ వీడియోలు వచ్చాయి. తగ్గేదే లేదు అంటూ గడ్డం కింద చేయి పెట్టి అల్లు అర్జున్ స్టైల్ లో చేస్తూ ఫొటోలకు ఫోజులు ఇస్తూ ఆ డైలాగ్ ను మోస్ట్ పాపులర్ చేయడం జరిగింది. తాజాగా ఆ డైలాగ్ ను ఒక పెళ్లి కొడుకు చెప్తూ పెళ్లి కూతురు దండ వేస్తూ ఉంటే అందకుండా పై పైకి వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరాదిన పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు దండలు మార్చుకునే సమయంలో ఒకరికి ఒకరు దొరకకుండా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సమయంలో పెళ్లి కొడుకు తగ్గేదే లే అంటూ సూట్ అయ్యేలా హిందీ డైలాగ్ చెప్పి అక్కడున్న వారిని నవ్వించాడు. అది కాస్త వైరల్ అవుతోంది.
పుష్ప సినిమా తగ్గేదే లే డైలాగ్ ఇలానే కాకుండా రకరకాలుగా వినియోగించేస్తున్నారు. శ్రీవల్లి స్టెప్ తో ప్లోర్ ను క్లీన్ చేయడం మొదలుకుని పులి ముందు నిల్చుని తగ్గేదే లే అంటూ డైలాగ్ చెప్పే వరకు ఎన్నో షార్ట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని రోజులు పుష్ప ఈ సందడి కొనసాగుతుందో చూడాలి. ఈ హడావుడి పూర్తి అవ్వకుండానే పుష్ప పార్ట్ 2 ను మొదలు పెట్టేందుకు సుకుమార్ సిద్దం అయ్యాడు. అతి త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. షూటింగ్ కాస్త అటు ఇటుగా మొదలు పెట్టినా కూడా డిసెంబర్ లో సినిమా ను విడుదల చేసి తీరుతాం అంటూ ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. 50 రోజులు పూర్తి చేసుకున్న పుష్ప సినిమా 350 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకుంది. హిందీ వర్షన్ వంద కోట్లకు పైగా వసూళ్లు చేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది.
Full View