తెలుగు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పదవికి రాజీనామా చేశారు. కొద్ది గంటల క్రితమే మహారాష్ట్ర అడిషనల్ డీజీ పదవికి ఆయన గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియా మిత్రులతో ధ్రువీకరించారు. కాగా బీజేపీ లేదా జనసేన పార్టీ వైపు లక్ష్మీనారాయణ అడుగులు పడబోతున్నాయని సమాచారం.
మహారాష్ట్ర కేడర్ కు చెందిన లక్ష్మీనారాయణ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తు సమయంలో వార్తల్లో నిలిచారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ - సత్యం కుంబకోణం లాంటి కేసుల్లోనూ దర్యాప్తు చేశారు. కాగా, ఆయన రాజకీయ ప్రయాణఃపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. అధికార బీజేపీ ఆయనతో రాజీనామా చేయించిందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏపీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు. కాగా, తాను చేరబోయే పార్టీ గురించి త్వరలోనే వెల్లడిస్తారని తెలుస్తోంది.