బాబును ఫాలో కావొద్దని రాహుల్ కు చెప్పిన మాజీ సీఎం?

Update: 2019-05-11 14:30 GMT
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో రాహుల్ భజన గట్టిగా చేస్తూ ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఢిల్లీ వెళ్లిన ప్రతి సారీ రాహుల్ దర్శనం చేసుకుని వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. రాహుల్ కు వరసగా శాలువాలు కప్పి వస్తూ ఉన్నాడాయన.

ఇక  కాంగ్రెస్ భజన కూడా గట్టిగానే సాగిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ పార్టీని మోడీ ఏమైనా అంటే బాబు భరించలేకపోతూ ఉన్నాడు. ఇలా కాంగ్రెస్ మీద తన విధేయత చూపుతూ ఉన్నాడు. ఇది వరకూ బీజేపీ మీద ఎంత విధేయత చూపించాడో.. ఇప్పుడు కాంగ్రెస్ మీద అంతే స్థాయి విధేయత చూపుతున్నాడు చంద్రబాబు నాయుడు.

ఇక రాహుల్ ఇంకా పూర్తి గా రాజకీయాల్లో మగ్గలేదు.  ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గట్టిగా భజన చేస్తుండే సరికి.. రాహుల్ కూడా చంద్రబాబు ట్రాప్ లో పడిపోతాడేమో అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీరు గురించి బాగా తెలిసిన ఒక మాజీ సీఎం రాహుల్ కు ఈ విషయంలో హెచ్చరిక లాంటి బోధ చేశారట. రాహుల్ కు సూటిగా కాకపోయినా.. రాహుల్ అనుచవర్గానికి ఆ మాజీ సీఎం ఈ విషయాన్ని చెప్పిందట. 'చంద్రబాబును మరీ గుడ్డి నమ్మేయొద్దు..' అని అన్నారట. అలా అన్నది మరెవరో కాదు యూపీ మాజీ సీఎం మాయవతి.

చంద్రబాబు నాయుడు రాజకీయాలను ఆమె దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు మాయవతి దగ్గరకు వెళ్లి ఫోర్త్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ తర్వాత చంద్రబాబు బీజేపీ పంచన చేరిపోయాడు.

అలాంటి బాబు తీరును మాయ బాగానే స్టడీ చేసినట్టుగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో… రాహుల్ గాంధీ కోటరికి మాయ ఈ సలహా ఇచ్చిందట. 'బాబును మరీ గట్టిగా నమ్మేయొద్దు..  రేపు ఫలితాలు తేడా వస్తే మళ్లీ  మోడీ పంచన చేరడానికి కూడా మొహమాట పడే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు..' అని మాయావతి సూటిగా చెప్పిందని ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం! 
Tags:    

Similar News