బాలినేనికి హై బీపీ... ?

Update: 2022-04-10 08:30 GMT
నిన్నటిదాకా వైసీపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బాలినేని శ్రీనివాస రెడ్డికి హై బీపీ వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన గత కొద్ది రోజులుగా తీవ్ర వత్తిడికి లోను అవుతున్నారు. ఇప్పటిదాకా మీడియాలో హల్ చల్ చేస్తున్న కాబోయే మంత్రుల పేర్లలో ఆయన పేరు ఎక్కడా కనిపించడంలేదు.

పైగా ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉంటే అందులో ఆదిమూలపు సురేష్ ని మాత్రమే  మంత్రిగా కొనసాగించి బాలినేనికి చెక్ చెప్పబోతున్నారు అని అంటున్నారు. దాంతో ఉంటే ఇద్దరూ ఉండాలి. లేకపోతే లేదు అని ఏకంగా ముఖ్యమంత్రి జగన్ కే నేరుగా  చెప్పేసి వచ్చిన బాలినేని తనను కూడా కొనసాగించాలని గట్టిగా కోరుకుంటున్నారు.

అయితే తుది విడత కసరత్తుకు కధ చేరినా బాలినేని పేరు అయితే ప్రస్థావనకు లేదని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఆయనకి హై బీపీ వచ్చింది అని ప్రచారం కావడం విశేషం. మరో వైపు చూస్తే బాలినేని ఇంటివద్దకే వైద్యులు వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు అని చెబుతున్నారు. మొత్తానికి బాలినేని మాత్రమే కాదు సీనియర్లతో పాటు చాలా మంది ఆశావహులు కూడా టెన్షన్ పడుతున్నారు. దాంతోనే కొందరికి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయని అంటున్నారు.
Tags:    

Similar News